England Vs New Zealand: ఆధునిక క్రికెట్లో ఆస్ట్రేలియా, భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రధమ, ద్వితీయ స్థానాలను క్షణం క్షణం మార్చుకుంటూ.. ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇంతటి పోటీ తత్వంలోనూ ఇంగ్లాండ్ జట్టు అరుదైన రికార్డును సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన ఘనతను అందుకుంది.
ఇంగ్లాండ్ జట్టు క్రికెట్ కు పుట్టినిల్లు. దాదాపు 147 సంవత్సరాల నుంచి ఆ జట్టు క్రికెట్ ఆడుతోంది. టెస్ట్ క్రికెట్లో సరికొత్త సంప్రదాయాలకు ఇంగ్లాండు జట్టు శ్రీకారం చుట్టింది. వన్డేలు, టి20 ఫార్మాట్ లోనూ అదరగొడుతోంది. అయితే ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం ఓ అద్భుతమైన చరిత్రను సృష్టించింది. 147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో సువర్ణధ్యాయాన్ని లిఖించింది.. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లో దూకుడు మీద ఉన్న భారత్, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సాధించిన ఘనతను అందుకోలేవు. ఇక ముందు కూడా ఆ స్థాయిని చేరుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోలేవు. ఎందుకంటే ఇంగ్లాండ్ సాధించిన రికార్డు ఆ విధంగా ఉంది మరి.
టెస్ట్ క్రికెట్ కు 147 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు ఎన్నో జట్లు అద్భుతమైన రికార్డులు సృష్టించాయి. అయితే ఇందులో ఇంగ్లాండ్ సాధించిన రికార్డు మాత్రం అనన్య సామాన్యం. ఎందుకంటే 147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 5 లక్షలకు పైగా పరుగులు చేసిన తొలి టీం గా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. మొత్తంగా ఇంగ్లాండ్ జట్టుకు ప్రస్తుతం న్యూజిలాండ్ తో ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ 1,082 వది. ఇక ఈ లిస్టులో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు 4,28,868 పరుగులు చేసింది. టీమిండియా 2,78,751 పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రారంభంలో టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వెస్టిండీస్ నుంచి మొదలుపెడితే ఆస్ట్రేలియా వరకు అన్ని దేశాలపై సంపూర్ణమైన పై చేయిని సాధించింది. కానీ నవీన క్రికెట్ ఊపందుకున్న తర్వాత.. ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్ వంటి జట్లు క్రికెట్లో లో సంచలనాలు సృష్టించడం మొదలైన తర్వాత.. టెస్ట్ క్రికెట్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇంగ్లాండ్ ఆధిపత్యం తగ్గిపోయింది. అయినప్పటికీ ఆ జట్టు విజయాలు సాధించడం తగ్గలేదు. అందువల్లే పరుగుల వరద పారిస్తోంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఐదు లక్షల పరుగులు చేసిందంటే మామూలు విషయం కాదు. అయితే ఆస్ట్రేలియా ఆ రికార్డును ఇప్పట్లో బద్దలు కొట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ క్రికెట్ లో బజ్ బాల్ అనే విధానానికి శ్రీకారం చుట్టింది.. దానివల్ల పరుగుల వరద పారుతుంది. భారత్ పై మాత్రం బజ్ బాల్ విధానం వర్కౌట్ అవ్వలేదు..
రెండు టెస్ట్ పై పట్టు
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ పై రెండవ టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్.. క్రమంగా పట్టు బిగిస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండు జట్టు తొలి టెస్ట్ గెలిచింది. రెండో టెస్టులో భారీ లీడ్ సాధించింది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు రెండవ ఇన్నింగ్స్ లో ఏకంగా ఐదు వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. ఇప్పటివరకు న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ జట్టు ఆధిక్యం 533 రన్స్ కు చేరుకుంది. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 125 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 280 రన్స్ చేసింది. ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధిస్తే సిరీస్ వర్షం అవుతుంది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. భారీ లక్ష్యం ఎదుట ఉంది. ఈ టార్గెట్ ను చేజ్ చేయాలంటే న్యూజిలాండ్ జట్టు అద్భుతాన్ని సృష్టించాల్సి ఉంటుంది.