Homeఎంటర్టైన్మెంట్Star Hero: జీవితంలో చెప్పులు వేసుకోకూడదని డిసైడైన స్టార్ హీరో... ఎందుకో తెలుసా?

Star Hero: జీవితంలో చెప్పులు వేసుకోకూడదని డిసైడైన స్టార్ హీరో… ఎందుకో తెలుసా?

Star Hero: ఓ హీరో జీవితంలో చెప్పులు వేసుకోకూడదని డిసైడ్ అయ్యాడు. అలాగని ఆయనేమీ దీక్షలో లేడు. ఒక సిద్ధాంతం పెట్టుకుని అలా ఫిక్స్ అయ్యాడట. ఆ హీరో ఎవరో కాదు విజయ్ ఆంటోని. ఆయన చెప్పులు ఎందుకు ధరించకూడదని నిర్ణయం తీసుకున్నారో చూద్దాం. విజయ్ ఆంటోని(Vijay Antony) మల్టీ టాలెంటెడ్. మ్యూజిక్ డైరెక్టర్ గా పరిశ్రమలో అడుగుపెట్టి హీరో అయ్యాడు. విజయ్ ఆంటోని నటుడు, దర్శకుడు, ఎడిటర్, గేయ రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్… ఇలా అనేక ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందాడు. విజయ్ ఆంటోని సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన నాన్, సలీం ఆయనకు నటుడిగా ఫేమ్ తెచ్చాయి. ఇక బిచ్చగాడు మూవీతో తెలుగులో కూడా ఇమేజ్ తెచ్చుకున్నాడు. 2016లో విడుదలైన బిచ్చగాడు బాక్సాఫీస్ షేక్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో భారీ లాభాలు పంచింది. బిచ్చగాడు చిత్రానికి విజయ్ ఆంటోని నిర్మాత కూడాను. తెలుగు హక్కులు కొన్నవారు, డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్లకు బిచ్చగాడు(Bichagadu) కాసుల వర్షం కురిపించింది.

Also Read: Simbu: ప్రముఖ నటుడి కూతురితో శింబు వివాహం… కోలీవుడ్ ని షేక్ చేస్తున్న న్యూస్!

బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ గా 2023 బిచ్చగాడు 2 విడుదలైంది. మొదటి భాగం స్థాయిలో హిట్ కాకపోయినా.. సక్సెస్ అయ్యింది. కాగా విజయ్ ఆంటోని లైఫ్ స్టైల్ కూడా ప్రత్యేకమే. అతడు చెప్పులు వేసుకోకుండా జీవించాలని డిసైడ్ అయ్యాడట. ఇకపై జీవితంలో చెప్పులు ధరించను అని శబధం చేశాడు. దానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదట. ఆయన దీక్షలాంటిది ఏమీ చేపట్టలేదట.

Also Read: Gangs Of Godavari Twitter Talk: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్విట్టర్ టాక్: ఈ టాక్ అసలు ఊహించలేదు, అక్కడే తేడా కొట్టిందట! విశ్వక్ సేన్

ఒకరోజు చెప్పులు లేకుండా నడిచాడట. అది ఆయనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందట. అప్పుడే ఫిక్స్ అయ్యాడట. ఇకపై చెప్పులు లేకుండా నడవాలని నిర్ణయించుకున్నాడట. చెప్పులు లేకుండా ఒట్టి కాళ్లతో నడవడం ఆరోగ్య ప్రయోజనం కూడాను అంటున్నారు. కాగా గత ఏడాది విజయ్ ఆంటోని కుటుంబంలో అత్యంత విషాదం చోటు చేసుకుంది. విజయ్ ఆంటోని కూతురు మీరా(Meera) ఆత్మహత్య చేసుకుంది. ఆమె 12వ క్లాస్ చదువుతుంది.

RELATED ARTICLES

Most Popular