Prabhas: ప్రభాస్ తో సినిమా అంటే భయపడిపోతున్న స్టార్ డైరెక్టర్…కారణం ఏంటంటే..?

బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ను అందుకున్న ప్రభాస్ తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఇండియా లో నెంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్నాడు...

Written By: Gopi, Updated On : August 22, 2024 9:28 am

Prabhas(4)

Follow us on

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాస్… ఆయన స్టార్ డమ్ ను విస్తరిస్తూ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఈయనతో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్ల సైతం పోటీ పడుతున్న సమయంలో ఈయన మాత్రం చాలా సెలెక్టెడ్ గా సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరూ అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ మాత్రం ప్రభాస్ తో సినిమా అంటే కొద్దిగా భయపడిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాస్ స్టార్ డమ్ ను మ్యాచ్ చేసే కథ ప్రస్తుతానికి తన దగ్గర లేదని తనకు మంచి కథ దొరికినప్పుడు తప్పకుండా ప్రభాస్ తో సినిమా చేస్తానని ఆయనతో సినిమా చేయడం నా డ్రీమ్ అంటూ లోకేష్ కనకరాజ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషము…

ఇక మొత్తానికైతే ప్రభాస్ లాంటి స్టార్ హీరో దొరికితే ఇండస్ట్రీ హిట్టు కొట్టాలని ప్రతి డైరెక్టర్ పరితపిస్తున్నాడు. ప్రభాస్ కూడా ఫ్యూచర్ లో మంచి సినిమాలు చేయడానికి ఎవరెవరికి అవకాశాలు ఇస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరో గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కూడా ప్రభాసే కొనసాగుతూ ఉండటం విశేషం…

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు సైతం సక్సెసులు లేక విలవిల్లాడుతున్న సమయంలో ప్రభాస్ వరుసగా సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్లడం ఒక వంతుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని ఇండియా నలుమూలాల చాటి చెబుతుందనే చెప్పాలి… రీసెంట్ గా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ‘కల్కి ‘ సినిమా వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న ప్రభాస్ రాబోయే సినిమాలతో కూడా అంతకుమించి సక్సెస్ లను కొట్టాలని చూస్తున్నాడు.

మరి తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… ఫౌజీ సినిమా తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలను కూడా లైన్ లో పెట్టే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఇప్పటికే మారుతి డైరెక్షన్ లో చేస్తున్న ‘రాజాసాబ్ ‘ సినిమాని వచ్చే సంవత్సరం రిలీజ్ చేయడానికి ముస్తాబు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది…