https://oktelugu.com/

HBD Mahesh Babu: ఎంతో మందికి బతుకునిచ్చిన నిజమైన హీరో ‘మహేష్’…

తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నప్పటికి కొందరికి మాత్రమే ఇక్కడ మంచి గుర్తింపు లభిస్తుంది... వాళ్లే స్టార్ హీరోలుగా వెలుగొందుతారు. ఇక అందుకే సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలా మార్కెట్ అనేది బాగా పెరుగుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : August 9, 2024 / 01:57 PM IST

    HBD Mahesh Babu

    Follow us on

    HBD Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో తనను తాను స్టార్ హీరో గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలు సాధించడంతో ఆయనకు నటుడిగా మంచి గుర్తింపైతే లభించింది. ఇక దాంతో పాటుగా ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయం సాధించడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు అందులో భాగంగానే రాజమౌళితో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా కోసం ఆయన కసరత్తులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మహేష్ బాబు లుక్ కూడా ఫైనల్ అవ్వడం తో అది వైరల్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఆయన సినిమాలు చేయడమే కాకుండా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలను చేస్తాడనే విషయం మనకు తెలిసిందే… ప్రస్తుతం ఈరోజు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాడు. ఇక దాంతోపాటుగా ఆయన హీరోగా కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన ‘మురారి ‘ సినిమాను రీ రిలీజ్ చేశారు.

    ఇక మొత్తానికైతే ఈ సినిమా భారీ అంచనాల మధ్య రావడమే కాకుండా మహేష్ అభిమానులను చాలా వరకు అదరిస్తుందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు 2021 సంవత్సరంలో ఏకంగా 30 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించాడు. ఇక దాంతోపాటుగా ఆంధ్రలోని ‘బుర్రిపాలెం ‘ తెలంగాణలోని ‘సిద్దాపురం ‘అనే గ్రామాలను దత్తత తీసుకొని దాన్ని డెవలప్ చేయడానికి కూడా ఆయన చాలా డబ్బులను కేటాయించాడు.

    ఇక మొత్తానికైతే దాతృత్వ కార్యక్రమానికి ఏటా 30 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన సినిమాలు మాత్రమే చేయకుండా అడ్వర్టైజ్మెంట్స్ తో పాటు పలు వ్యాపార సంస్థలను కూడా కొనసాగిస్తున్నాడు. దానివల్ల మహేష్ బాబు సంవత్సరానికి దాదాపు 400 నుంచి 500 కోట్ల వరకు సంపాదిస్తూ ఉంటాడు. ఇక అందులో 30 నుంచి 40 కోట్ల వరకు సేవా కార్యక్రమాల కోసమే వినియోగించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి… ఈరోజు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలపడానికి చాలామంది ఆయన ఇంటికి వెళ్లినట్టుగా తెలుస్తుంది. ఇక సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు తన అభిమానులు కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు…

    ఇక మొత్తానికైతే ప్రస్తుతం సినిమాల్లో ఆయన చాలా బిజీ అవుతున్నాడు. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ని అందించక పోయినా కూడా మహేష్ బాబు ఎక్కడ నిరాశపడకుండా తన అభిమానుల కోసం రాజమౌళి తో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తూనే ఈసారి భారీ స్థాయిలో సక్సెస్ ని కొట్టబోతున్నట్లు గా తెలుస్తుంది. అయితే ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్న నేపథ్యంలో 2028 లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయి రాజమౌళి కి మహేష్ బాబు కి గొప్ప పేరు తీసుకొస్తుందా లేదా అనేది విషయాలు తెలియాల్సి ఉంది…