Kodama Simham: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమాలన్నీ ఒకప్పుడు గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే చిరంజీవి సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించే స్థాయికి ఎదిగాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఒకప్పుడు చిరంజీవి చేసిన కొదమ సింహం సినిమా కౌబాయ్ సినిమాల్లో గొప్ప గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ మూవీ రీసెంట్ గా రీరిలీజ్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి ఒక సాంగ్ లో తను 360 డిగ్రీ లో నడుస్తూ ఉంటాడు.ఆ షేర్ ను ఎలా తీశారు అనే విషయాన్ని చిరంజీవి చెప్పడం విశేషం…ఆ షాట్ కోసం సెపరేట్ గా ఇక సెట్ రెడీ చేశామని చెప్పారు. అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. దానికి కెమెరాను ఫిక్స్ చేసి నేను నడుస్తూ ఉన్నాను అది క్యాప్చర్ అయింది అంటూ చిరంజీవి ఈ విషయాన్ని చెప్పాడు.
అలాగే ఆ షాట్ ను మేము అప్పట్లోనే చేశాము. మా తర్వాత హాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన ‘ఇన్స్పెక్షన్’ సినిమాలో కూడా సేమ్ అలాంటి షాట్ ను వాడరు అంటూ చిరంజీవి చెప్పిన మాటల ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి అప్పుడెప్పుడో మనవాళ్ళు చేసిన షాట్ ను హాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక దీన్ని బట్టి చూస్తే అప్పట్లో మన టెక్నీషియన్స్ హాలీవుడ్ ను మించి ఆలోచించే వాళ్ళు అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది… ఇక మొత్తానికైతే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ మూవీ మీదనే ఎక్కువ ఫోకస్ చేశాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఈ సినిమాని 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక అలాగే వశిష్ట డైరెక్షన్లో చేసిన ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ అయిపోయినప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ విషయంలో చిరంజీవి కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలనే ఉద్దేశ్యంతో దానిని మరోసారి గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సినిమాని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుండడం విశేషం…