Jr NTR Prashanth Neel movie: ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న భారీ బడేటి పాన్ ఇండియన్ సినిమాల్లో అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) చిత్రం. ఈ సినిమా షూటింగ్ నత్త నడకన సాగుతుందనే కంప్లైంట్ అయితే ఉంది కానీ, డైరెక్టర్ విజన్ ఈ సినిమా కోసం చాలా పెద్దది అని, ఆ మాత్రం సమయం తీసుకొని తెరకెక్కించడం లో ఎలాంటి తప్పు లేదని అభిమానులు అంటున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ కర్ణాటక, హైదరాబాద్ మరియు విదేశాల్లో జరిగింది. 1969 వ సంవత్సరం లో చైనా, భూటాన్, ఇండియా సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన డ్రగ్ మాఫియా ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కొన్ని యదార్ధ సంఘటనలు కూడా ఉంటాయట.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ రేపటి నుండి జోర్డాన్ దేశం లో జరగనుంది. ఈ షెడ్యూల్ లో మూడు భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. మలయాళం స్టార్ హీరో టోనీవో థామస్ కూడా ఈ షెడ్యూల్ లో చేరబోతున్నాడు. ఎన్టీఆర్ , టోనీవో మధ్య కొన్ని భారీ యాక్షన్ ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. ఈ షెడ్యూల్ కోసం టోనీవో థామస్ తన సిక్స్ ప్యాక్ బాడీ ని సిద్ధం చేసుకున్న లేటెస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియా లో ఎంత వైరల్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తల్లి సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిస్తున్నాడట. KGF సిరీస్ కి, సలార్ మూవీ కి తల్లి సెంటిమెంట్ ఎంత కీలకంగా ఉన్నిందో మనమంతా చూసాము. ఆయనకు ఈ తల్లి సెంటిమెంట్ బాగా వర్కౌట్ కూడా అయ్యింది. ‘సలార్’ లో అగ్నిపర్వతం లాంటి హీరో పాత్ర, తల్లి మాట కోసం సైలెంట్ గా ఉండడం ప్రేక్షకులకు థియేటర్స్ లో కొత్త అనుభూతిని ఇచ్చింది.
ఇకపోతే ఎన్టీఆర్ ని ఇందులో KGF హీరో పాత్ర తరహాలో పూర్తి స్థాయి నెగటివ్ షేడ్స్ లో చూపించబోతున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్మిణి వాసంత్ నటిస్తోంది. డిసెంబర్ నెల లోపు ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే వచ్చే ఏడాది విడుదలయ్యే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు మొత్తం రిలీజ్ డేట్స్ ని లాక్ చేసుకున్నాయి. కానీ ఈ చిత్రాన్ని మాత్రం ఎప్పుడు విడుదల చెయ్యాలో ఇంకా నిర్మాతలు నిర్ణయం తీసుకోలేదు. మే లేదా, దసరా నెలలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
