Prabhas Japan craze: మన టాలీవుడ్ నుండి ఈ తరం హీరోలలో మొట్టమొదటి పాన్ ఇండియన్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas). మన తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ‘బాహుబలి 1’ తో పాన్ ఇండియా మొత్తం రీ సౌండ్ వచ్చే రేంజ్ లో బ్లాక్ బస్టర్ ని అందుకున్న ప్రభాస్, ‘బాహుబలి 2’ తో ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా మన టాలీవుడ్ వైపు చూసేలా చేసాడు. ప్రభాస్ కి ఉన్నంత ఓవర్సీస్ మార్కెట్ టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోకి కూడా లేదంటే అతిశయోక్తి లేదేమో. ఆయన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్’ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అంటారు, కానీ ఓవర్సీస్ లో ఈ చిత్రం 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. చాలా మంది స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలకు కూడా ఇంత వసూళ్లు వచ్చి ఉండవు.
ఇదంతా పక్కన పెడితే జపాన్ దేశం లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. ఆయన హీరో గా నటించిన బాహుబలి సిరీస్ కి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఆ తర్వాత విడుదలైన సాహూ చిత్రానికి మన ఇండియా లో ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ జపాన్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. రీసెంట్ గానే ‘కల్కి 2898 AD’ చిత్రాన్ని జపాన్ లో విడుదల చేస్తే, దానికి కూడా అక్కడి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలా వరుసగా జపాన్ లో సూపర్ హిట్స్ ని అందుకుంటూ సౌత్ నుండి రజినీకాంత్ తర్వాత జపాన్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా ప్రభాస్ పేరు దక్కించుకున్నాడు. అయితే రీసెంట్ గా జపాన్ లో ఆయనకు మరో అరుదైన గౌరవం దక్కింది.
ఆ దేశానికి చెందిన పాపులర్ వీక్లీ మ్యాగజైన్ ‘Anan’ ఫిబ్రవరి నెల ఎడిషన్ బ్యాక్ కవర్ పై సోలో గా కనిపించిన మొట్టమొదటి భారతీయుడిగా ప్రభాస్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. 2023 వ సంవత్సరం లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఈ మ్యాగజైన్ కవర్ పేజీ పై కనిపించారు. కానీ సోలో గా కనిపించింది మాత్రం ఒక్క ప్రభాస్ మాత్రమే. జపాన్ లో దశాబ్దాల నుండి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా ఇలాంటి గౌరవం దక్కలేదు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఎంతో గర్వ పడుతూ ట్వీట్లు వేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన లైనప్ లో స్పిరిట్, కల్కి 2 , ఫౌజీ చిత్రాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాల షూటింగ్స్ లో ఆయన సమాంతరంగా పాల్గొనబోతున్నాడు.
