https://oktelugu.com/

‘అరె కుర్రాడు బాగున్నాడే’.. పెళ్లిసందడికి 25 ఏళ్లు !

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు సూపర్ హిట్ సినిమాల్లో ‘పెళ్లి సంద‌డి’ అనే సినిమా ప్రత్యేకమైనది. ఆ రోజుల్లో.. అంటే పెళ్లి సందడి మొదలవుతున్న రోజులు.. అనగా, పాతికేళ్ళకి వెనక్కి వెళ్ళితే.. ‘ఎవరో శ్రీకాంత్ అనే కుర్రాడు అండీ, బాగానే చేస్తున్నాడు, హీరోగా బాగుంటాడు’ అంటూ ఓ కో డైరెక్టర్ మొదటిసారిగా రాఘ‌వేంద్ర‌రావుకి చెప్పారట. శ్రీకాంత్ ఫోటో చూసిన దర్శకేంద్రుడు.. ‘అరె కుర్రాడు బాగున్నాడు. ప్రస్తుతం ఏమైనా సినిమాలు చేస్తున్నాడా ?’ అంటూ మొదలైన ప్రస్తావన.. మొత్తానికి అద్భుతమైన సినిమాగా […]

Written By:
  • admin
  • , Updated On : January 12, 2021 / 07:41 PM IST
    Follow us on


    ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు సూపర్ హిట్ సినిమాల్లో ‘పెళ్లి సంద‌డి’ అనే సినిమా ప్రత్యేకమైనది. ఆ రోజుల్లో.. అంటే పెళ్లి సందడి మొదలవుతున్న రోజులు.. అనగా, పాతికేళ్ళకి వెనక్కి వెళ్ళితే.. ‘ఎవరో శ్రీకాంత్ అనే కుర్రాడు అండీ, బాగానే చేస్తున్నాడు, హీరోగా బాగుంటాడు’ అంటూ ఓ కో డైరెక్టర్ మొదటిసారిగా రాఘ‌వేంద్ర‌రావుకి చెప్పారట. శ్రీకాంత్ ఫోటో చూసిన దర్శకేంద్రుడు.. ‘అరె కుర్రాడు బాగున్నాడు. ప్రస్తుతం ఏమైనా సినిమాలు చేస్తున్నాడా ?’ అంటూ మొదలైన ప్రస్తావన.. మొత్తానికి అద్భుతమైన సినిమాగా బయటకు వచ్చింది.

    Also Read: మళ్ళీ న్యూడ్ గా నటిస్తా.. ‘రాధికా’ కొత్త సిరీస్ !

    కాగా ఈ సినిమా జ‌న‌వ‌రి 12,1996లో విడుద‌లైంది. నేటితో 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అయితే, ఈ సంద‌ర్భంగా రాఘవేంద్ర‌ర‌రావు ట్విట్ట‌ర్ ద్వారా ఈ సినిమా గురించి పోస్ట్ చేస్తూ.. ”నేటికి పెళ్ళి సందడి సినిమా విడుదలయ్యి 25 ఏళ్ళు అయింది. నా కెరీర్‏లో, శ్రీకాంత్ కెరీర్‏లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు కీరవాణికి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్‏లకు నమస్కరిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు దర్శకేంద్రుడు. ఇక ఈ సినిమాలోని ప్రతిపాట సూపర్ హిట్‏గా నిలిచింది.

    Also Read: 34 ఏళ్ల ‘శృతి హాసన్’.. ఆంటీ పాత్రలకే ఫిక్స్ !

    ఇప్పటీకి ఒక పెళ్లి జరుగుతుంది అంటే.. ఈ చిత్రంలోని పాటలనే ఆ పెళ్ళిలో ప్రధానంగా ప్లే చేస్తూ ఆనందిస్తారు. అంతగా ఈ సినిమా పాటలను ప్రేక్షకులు అలరిస్తునే ఉన్నారు. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ సరసన రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా నటించి మెప్పించారు. అయితే, ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా దర్శకేంద్రుడు ఈ సీక్వెల్ లో హీరోయిన్ ఎవ‌రనే విష‌యాన్ని కూడా తెలియజేస్తూ.. ‘శ్రీ లీల’ అనే కొత్త అమ్మాయి హీరోయిన్‌గా న‌టిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. ఇక రాఘ‌వేంద్ర‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గౌరీ రోనంకి ఈ సీక్వెల్ ‘పెళ్లి సందడ్’ సినిమాని తెర‌కెక్కిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్