చాన్స్ ఇస్తానని రేప్: టీ సిరీస్ హెడ్ పై అత్యాచారం కేసు

దేశంలోనే ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ హెడ్ భూషణ్ కుమార్ వివాదంలో ఇరుక్కున్నారు. మూడేళ్లుగా ఆయన తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. దివంగత గీత రచయిత గుల్షన్ కుమార్ కుమారుడే ఈ టీ సిరీస్ కంపెనీ ఎండీ భూషణ్ కుమార్. భూషణ్ 30 ఏళ్ల మహిళపై అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. భూషణ్ కుమార్ తన కంపెనీ ప్రాజెక్టులో భాగంగా ఉద్యోగం నెపంతో తనపై అత్యాచారం […]

Written By: NARESH, Updated On : July 16, 2021 4:00 pm
Follow us on

దేశంలోనే ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ హెడ్ భూషణ్ కుమార్ వివాదంలో ఇరుక్కున్నారు. మూడేళ్లుగా ఆయన తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది.

దివంగత గీత రచయిత గుల్షన్ కుమార్ కుమారుడే ఈ టీ సిరీస్ కంపెనీ ఎండీ భూషణ్ కుమార్. భూషణ్ 30 ఏళ్ల మహిళపై అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి.

భూషణ్ కుమార్ తన కంపెనీ ప్రాజెక్టులో భాగంగా ఉద్యోగం నెపంతో తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపించింది. 2017-2020 ఆగస్టు వరకు భూషణ్ కుమార్ తనను దాదాపు మూడేళ్లకు పైగా వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఆరోపించింది.

భూషణ్ ఆమెను వేర్వేరు ప్రదేశాలకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధిత మహిళ ఆరోపించింది. తన ఫొటో, వీడియో వైరల్ చేస్తామని నిందితుడు బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది.

ఈ క్రమంలోనే ముంబైలోని అంధేరికి చెందిన డీఎన్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

గతంలో మీటూ ఉద్యమం ద్వారా పాపులర్ అయిన మెరీనా కున్వర్ కూడా భూషణ్ కుమార్ తనను శారీరకంగా వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. తనను కలిసేందుకు.. తప్పుడు పనులు చేయడానికి ప్రయత్నించాడని ఆరోపించింది.

అయితే ఈ ఆరోపణలను భూషణ్ కుమార్ ఖండించారు. పబ్లిసిటీ కోసమే తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ప్రకటించారు.