మద్యం తాగేవారికి షాకింగ్ న్యూస్.. ఆ వ్యాధి బారిన పడే ఛాన్స్..?

మద్యపానం ఆరోగ్యానికి హానికరమని పెద్దలు చెబుతుంటారు. మద్యం సేవించడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉంటాయి. రోజూ మద్యం తాగేవారిని వేధించే ఆరోగ్య సమస్యలలో కేన్సర్ కూడా ఒకటి. ప్రపంచ దేశాల్లో మద్యం సేవించడం వల్ల క్యాన్సర్ బారిన పడిన వారి సంఖ్య ఏకంగా 7,41,300గా ఉంది. మద్యం వల్ల కేన్సర్ బారిన పడిన వారి శాతం 4 శాతం కావడం గమనార్హం. ప్రతి 25 మందిలో ఒకరు మద్యం సేవించడం వల్ల […]

Written By: Navya, Updated On : July 16, 2021 4:04 pm
Follow us on

మద్యపానం ఆరోగ్యానికి హానికరమని పెద్దలు చెబుతుంటారు. మద్యం సేవించడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉంటాయి. రోజూ మద్యం తాగేవారిని వేధించే ఆరోగ్య సమస్యలలో కేన్సర్ కూడా ఒకటి. ప్రపంచ దేశాల్లో మద్యం సేవించడం వల్ల క్యాన్సర్ బారిన పడిన వారి సంఖ్య ఏకంగా 7,41,300గా ఉంది. మద్యం వల్ల కేన్సర్ బారిన పడిన వారి శాతం 4 శాతం కావడం గమనార్హం.

ప్రతి 25 మందిలో ఒకరు మద్యం సేవించడం వల్ల కేన్సర్ బారిన పడ్డారు. మద్యం వల్ల ఎక్కువమంది కాలేయం, అన్నవాహిక, రొమ్ము కేన్సర్ బారిన పడ్డారని తెలుస్తోంది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేసి పరిశోధనల ఫలితాలను వెల్లడించింది. సైన్స్ జర్నల్ లాన్సెట్ ఆంకాలజీలో ఈ పరిశోధనలకు సంబంధించిన ఫలితాలు వెల్లడి కావడం గమనార్హం.

మద్యం తాగడం వల్ల మంగోలియాలో ఎక్కువగా కేన్సర్ కేసులు నమోదయ్యాయి. బ్రిటన్ ఈ జాబితాలో 38వ స్థానంలో ఉండగా కువైట్ లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అమెరికాలో 3 శాతం క్యాన్సర్ కేసులు మద్యం తాగడం వల్ల సంభవించినట్లు తెలుస్తోంది. ఆల్కహాల్ నిషేధించబడిన దేశాలలో మాత్రం మద్యపానం వల్ల నమోదైన కేన్సర్ కేసులు తక్కువగా నమోదయ్యాయని సమాచారం.

ప్రపంచ దేశాల్లో 77 శాతం మంది పురుషులు మద్యం సేవించడం వల్ల కేన్సర్ బారిన పడితే 23 శాతం మంది మహిళలు మద్యం వల్ల కేన్సర్ బారిన పడ్డారు. మద్యం సేవించడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.