Bigg Boss 6- Sudeepa: తెలుగు బుల్లితెర పై సంచలనం సృష్టించిన రియాలిటీ షో బిగ్ బాస్..ఇప్పటి వరుకు 5 సీసన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు ఆరవ సీసన్ లోకి అడుగుపెట్టబోతుంది..ఈ ఆరవ సీసన్ వచ్చేనెల మొదటి వారం నుండి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కాబోతుంది..ఈ సీసన్ కి సంబంధించిన ప్రోమో ని కూడా ఇటీవలే విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఈ షో ఏ తేదీ నుండి ప్రారంభం అవుతుంది..టైమింగ్స్ ఏమిటి అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు..ఇది ఇలా ఉండగా గత మూడు సీసన్స్ నుండి అక్కినేని నాగార్జున ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు..ఇప్పుడు ఆరవ సీసన్ కి కూడా ఆయన హోస్ట్ గా వ్యవహటించబోతున్నాడు..ఇక ఈ షో లో పాల్గొనే కంటెస్టెంట్స్ విషయం లో కూడా స్టార్ మా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..ఇప్పటికే పలువురి పేర్లు సోషల్ మీడియా లో గత కొంత కాలం నుండి జోరుగా ప్రచారం అవుతున్నాయి..ఇప్పుడు లేటెస్ట్ గా మరో ప్రముఖ సెలబ్రిటీ ఈ షో లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.

ఆమె మరెవరో కాదు..ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో బాలనటిగా నటించిన సుదీప..ఈమె పేరు చెప్తే బహుశా మీకు గుర్తుకు రాకపోవచ్చు..కానీ ముఖం చూస్తే తప్పక గుర్తు పడుతారు..విక్టరీ వెంకటేష్ మరియు ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లు గా విజయ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా అప్పట్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయింది..అయితే ఈ చిత్రం ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా నటించిన పింకీ అనే అమ్మాయి ని మనం అంత తేలికగా మర్చిపోగలమా!..తన చలాకి నటనతో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది ఈ అమ్మాయి.
Also Read: Karthikeya2 Review: రివ్యూ : ‘కార్తికేయ 2’

ఆ తర్వాత ఈమె ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ కూడా ఈ సినిమా ద్వారా వచ్చినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి..ఇక ఆ తర్వాత ఈమె ఎన్నో టీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించింది కూడా..అవి కూడా పెద్దగా సక్సెస్ కాలేదు..ఇప్పుడు ఈమె బిగ్ బాస్ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులకు చేరువ అయ్యి తన కెరీర్ మైలేజ్ ని పెంచుకోడానికి ట్రై చేస్తుంది..మరి ఆమె ఆశించిన పాపులారిటీ ఈ బిగ్ బాస్ షో ద్వారా వస్తుందో లేదో చూడాలి.
[…] Also Read: Bigg Boss 6- Sudeepa: బిగ్ బాస్ 6 షోలో కంటెస్టెంట్ గ… […]