Karthikeya2 Review: రివ్యూ : ‘కార్తికేయ 2’
నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు.
దర్శకుడు: చందూ మొండేటి
నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, టి జి విశ్వ ప్రసాద్
సంగీత దర్శకులు: కాలభైరవ
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటర్: కార్తీక్ ఘట్టమనేని

‘చందు మొండేటి’ డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కార్తికేయ 2’. ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.
కథ :
కార్తికేయ (నిఖిల్) ఒక డాక్టర్. తనకు వచ్చిన సమస్యకు నిఖిలే ఒక సమాధానం. అయితే, కార్తికేయ తన తల్లి (తులసి) మొక్కిన మొక్కు కోసం ద్వారక కు వెళ్లాల్సి వస్తోంది. శ్రీకృష్ణుని దివ్య క్షేత్రం ద్వారకా నగరంలో కార్తికేయకి ఒక కనెక్షన్ ఉంటుంది. కానీ అక్కడ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. పోలీసుల నుంచి నిఖిల్ ను ముగ్ధ (అనుపమ పరమేశ్వరన్) తప్పిస్తొంది. ఇంతకీ కార్తికేయ మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నాడు?, ఇంతకీ ముగ్ధ ఎవరు ?, ఆమెకు కార్తికేయకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి ?, అసలు కార్తికేయను ద్వారకకు శ్రీకృష్ణుడు ఎందుకు రప్పించాడు ? చివరకు కార్తికేయ ఏం సాధించాడు ?, ఈ మధ్యలో కార్తికేయ అనేక సమస్యలు ఎదురవుతాయి ? మరి ఆ సమస్యల నుంచి కార్తికేయ ఎలా బయటపడ్డాడు ? అసలు కార్తికేయ చుట్టూ ఉన్న కథేంటి? చివరగా శ్రీకృష్ణుడు మన జాతికి ఇచ్చిన సందేశం ఏమిటి ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
నిఖిల్ తనకు వచ్చిన సమస్య కోసం ఏం చేశాడు ?, శ్రీకృష్ణుడు ఇచ్చిన ఆదేశం కోసం ఏం సాధించాడు ? అనే కోణంలో రివీల్ అయ్యే ట్విస్ట్ లు, ఎమోషన్స్ అలాగే హీరో క్యారెక్టర్ ఎలివేషన్స్ బాగున్నాయి. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మలుపులు, మరియు ఇంటర్వెల్ లో రివీల్ అయ్యే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో హైలైట్ గా నిలిచాయి. నిఖిల్ కూడా సినిమా సినిమాకి నటనలో మంచి ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నాడు. తనదైన సహజమైన నటనతో ఈ అడ్వెంచర్ డ్రామా లో సెటిల్డ్ పెర్ఫామెన్స్ కనబర్చాడు.
నిఖిల్ క్యూరియాసిటీ టైమింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చక్కటి హావభావాలతో ఆకట్టుకుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా చాలా బాగా నటించారు. ఇక కార్తికేయ 2 సినిమాలో సాంకేతిక నిపుణుల వర్క్ కూడా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు.

సంగీత దర్శకుడు అందించిన పాటలు పర్వాలేదు. అయితే హీరోయిన్ హీరోల మధ్య వచ్చే సన్నివేశాల్లోని నేపధ్య సంగీతం మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అయితే, సినిమా చూస్తున్నంత సేపు కథనం చాలా స్లోగా సాగుతుంది. కొన్ని చోట్ల లాజిక్స్ లేవు. అనవసర సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.
ప్లస్ పాయింట్స్ :
అడ్వెంచర్ సీన్స్,
మెయిన్ థీమ,
నిఖిల్ నటన,
నిఖిల్- అనుపమ మధ్య కెమిస్ట్రీ,
కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్,
సంగీతం.
మైనస్ పాయింట్స్ :
స్లో సాగే కథనం,
కన్ ఫ్యూజన్ సాగే పాత్రలు,
సినిమా చూడాలా ? వద్దా ?
హిస్టారికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నిఖిల్ తన నటనతో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లాడు. చందు డైరెక్షన్ స్కిల్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది.
3.25 / 5
బోటమ్ లైన్ : మెప్పించే అడ్వెంచర్ థ్రిల్లర్ !
[…] Also Read: Karthikeya2 Review: రివ్యూ : ‘కార్తికేయ 2’ […]