Mahanati Movie- Nithya Menen: తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో మహానటి సావిత్రి గారి స్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..హీరోయిన్ అంటే ఇలాగె ఉండాలి..నటన అంటే ఇలాగె ఉండాలి అని అనిపించే విధంగా ఉంటుంది సావిత్రి గారిది..అలాంటి హీరోయిన్ తన జీవితం లో ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుగులను ఎత్తుపల్లాలను కళ్ళకి కట్టినట్టు చూపించిన సినిమా మహానటి..కీర్తి సురేష్ ఈ సినిమాలో సావిత్రి గారి పాత్రని పోషించారు..ఇందులో ఆమె ఎంత అద్భుతంగా నటించింది అంటే సావిత్రి గారే మళ్ళీ పుట్టి వెండితెర ద్వారా మన ముందుకి వచ్చారా అనేంతలా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది కీర్తి సురేష్..ఆమె నటనకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ..డైరెక్టర్ నాగ అశ్విన్ కూడా సావిత్రి గారి జీవిత చరిత్ర పై ఎన్నో పరిశోధనలు జరిపి ఈ సినిమాని తీసినట్టు మనకి అనిపిస్తాది..ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్క నటీనటులు నటించలేదు..జీవించారనే చెప్పాలి..టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ పరంగా కూడా ఒక ప్రభంజనమే సృష్టించింది.
Nithya Menen
అప్పట్లోనే ఈ సినిమా దాదాపుగా 45 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది అంటే మాములు విషయం కాదు..లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో ఇప్పటికి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచినా సినిమా ఇదే అవ్వడం విశేషం..అయితే ఈ చిత్ర నిర్మాత అశ్వినీదత్ గారు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు..ఆయన మాట్లాడుతూ ‘మహానటి సినిమాలో ముందుగా నిత్యామీనన్ ని అనుకున్నాము.
Also Read: Bigg Boss 6- Sudeepa: బిగ్ బాస్ 6 షోలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్న పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్
Nithya Menen
ఈ కథని ఆమెకి వినిపించాము కూడా..కానీ ఈ సినిమాలో మందు తాగే సన్నివేశాలు బాగా ఉండడం తో..ఆ సన్నివేశాలు ఉంటె నేను సినిమా చెయ్యను అని చెప్పేసింది నిత్యా మీనన్..కానీ కథలో ఆ సన్నివేశాలు కచ్చితంగా ఉంది తీరాల్సిందే..దాంతో ఆమెని తప్పించి కీర్తి సురేష్ ని తీసుకోవాల్సి వచ్చింది’ అంటూ అశ్వినీదత్ గారు ఈ సందర్భంగా మాట్లాడారు..ప్రస్తుతం ఈయన మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ప్రస్తుతం అశ్వినీదత్ గారు ప్రభాస్ తో ప్రాజెక్ట్ K అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాని మహానటి దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.