Rajinikanth- Nani: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన వాళ్లలో చాలా మంది హీరోలున్నారు. వారిలో నాని ఒకరు. చిన్న పాత్రల నుంచి స్టార్ హీరో స్థాయి వరకు ఎదిగిన నాని సినిమా కోసం ఎదరుచూసే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. ఆయన నటించి రిలీజైన లాస్ట్ మూవీ ‘దసరా’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ అనే సినిమాతో వెండితెరపై మెరవబోతున్నాడు. ఈ తరుణంలో నానికి బంఫర్ ఆఫర్ వచ్చి పడింది. ఆయన ఏకంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..
‘అష్టా చెమ్మ’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన నానికి ‘అలా మొదలైంది’ మూవీ బ్రేక్ ఇచ్చింది. ఆయితే ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించినా గుర్తింపు రాలేదు. కానీ ఇటీవల ఆయన ఎంచుకున్న కథలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆయన సినిమాలన్నీ వరుస హిట్లుగా నిలుస్తున్నాయి. దీంతో ఆయన స్టార్ హీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు. రాజమౌళి లాంటి వాళ్లు నానితో సినిమా తీశారంటే ఆయన స్టేటస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా నాని సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ‘జై భీం’ దర్శకుడు జ్ఞానవేల్ రజనీకాంత్ తో ఓ సినిమా తీయడానికి ప్లాన్ వేస్తున్నాడు. ప్రస్తుతం రజనీ ‘జైలర్’ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే జ్ఞానవేల్ సినిమా ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో నానిని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో నాని ని సూపర్ స్టార్ పక్కన చూసే అవకాశం రావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ హ్యపీ అవుతున్నారు.
ఇప్పటికే చాలా సినిమాల్లో నాని మల్టీస్టారర్ గా నటించారు. అయితే స్టార్ హీరో పక్కన నటించడం ఇదే మొదటిసారి. అందులోనూ రజనీ పక్కన నటించడంతో తెలుగుతో పాటు తమిళంలోనూ ఆయనకు క్రేజ్ ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. జ్ఞానవేల్ సహకారంతో నాని మొత్తానికి తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. మరి నాని ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి.