Maruthi: పాన్ ఇండియా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో హీరో సైతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…ఇక ప్రభాస్ లాంటి నటుడి నుంచి రాబోతున్న సినిమాల విషయంలో అతని అభిమానులు చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజసాబ్ సినిమా 2026 సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదట్లో మారుతీతో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అనే విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోయారు. కారణం ఏంటి అంటే మారుతి ఇప్పటి వరకు స్టార్ హీరోలతో సినిమా చేయలేదు. వెంకటేష్ తో ‘బాబు బంగారం’ సినిమా చేసినప్పటికి ఆ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు…
దాంతో మారుతి స్టార్ హీరోలతో సినిమాలు చేయలేడు ఆయన యంగ్ హీరోలతో మాత్రమే సక్సెస్ లను సాధిస్తాడు అనే ఒక నెగెటివిటి ని సంపాదించుకున్నాడు. ఇక ప్రభాస్ తో సినిమా స్టార్ట్ అయిన విషయాన్నీ కూడా అఫిషియల్ గా ఎక్కడ అనౌన్స్ చేయలేదు. ఒక రెండు మూడు షెడ్యూల్స్ అయిపోయిన తర్వాత ప్రభాస్ – మారుతి కాంబినేషన్ లో సినిమా వస్తుందనే వార్తలైతే అందించారు.
గ్లింప్స్ రిలీజ్ చేయడంతో అభిమానులను సైతం కొంతవరకు మెప్పించడంతో వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక మారుతితో సినిమా చేయడాన్ని ఎవరు ఒప్పుకోకపోవడంతో అప్పట్లో వీళ్ళ మీద నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఇప్పటికే మారుతి ప్రభాస్ ను ఏ రేంజ్ లో చూపించాడు.
ఈ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నారనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ప్రభాస్ కమర్షియల్ సినిమాలను వదిలేసుకొని హర్రర్ సినిమాలను చేస్తుండటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది… ఇక మారుతి ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం టాప్ లెవల్ కి వెళ్తాడు. సక్సెస్ అవ్వకపోతే మాత్రం పూర్తిగా ఢీలా పడిపోతాడు…