Balakrishna And Naga Chaitanya: రాజమౌళి తెరకెక్కించిన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. అంతకుముందు అడపదడప మల్టీ స్టారర్ సినిమాలు వచ్చినప్పటికి స్టార్ హీరోలు కలిసి చేసిన మల్టీ స్టారర్ సినిమాలైతే రాలేదు… ఇక త్రిబుల్ ఆర్ మాత్రం కొత్త శకానికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు మరోసారి యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు భారీ మల్టీస్టారర్స్ సినిమాలైతే రాబోతున్నాయి. ఇక అందులో భాగంగానే నందమూరి నట సింహం గా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు అక్కినేని మూడోతరం హీరోగా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న నాగచైతన్య సైతం గతంలో బాలయ్య తో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయడానికి సన్న హాల్ చేసుకున్నాడు. కానీ ఆ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు… ఒక్కడు సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న గుణశేఖర్ వీళ్లిద్దరూ కాంబినేషన్లో సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. కానీ ఆ కథలో కొంతవరకు లోపాలు ఉన్నాయనే ఉద్దేశ్యంతో బాలయ్య దాన్ని రిజెక్ట్ చేశాడు. నాగచైతన్య క్యారెక్టరైజేషన్ ను చాలా బాగా మలిచిన గురుశేఖర్ బాలయ్య బాబు క్యారెక్టర్ కి సంబంధించిన విషయాల్లో క్లారిటీని మిస్ అయ్యాడు.
అందుకే బాలయ్య ఆ సినిమాని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. లేకపోతే మాత్రం బాలయ్య – నాగచైతన్య కాంబినేషన్లో గొప్ప సినిమా వచ్చి ఉండేదని చాలామంది సినిమా ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇకమీదటైనా వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
గత కొన్ని రోజుల నుంచి నాగార్జున బాలకృష్ణ ల మధ్య మాటలు లేనప్పటికి బాలయ్య బాబు నాగచైతన్యల మధ్య చాలా మంచి కమ్యూనికేషన్ ఉంది. వీళ్ళిద్దరు ఫంక్షన్స్ లో, పార్టీల్లో కలిసినపుడు మాట్లాడుకుంటారు. కాబట్టి వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే అటు అక్కినేని అభిమానులు ఇటు నందమూరి ఫ్యాన్స్ సైతం సంతోషిస్తారు. నిజానికి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం బాలయ్య బాబు ‘అఖండ 2’ సినిమాతో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు…ప్రస్తుతం ఆ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక నాగచైతన్య సైతం ఇప్పుడు ‘వృషకర్మ’ అనే సినిమా చేస్తున్నాడు…ఈ మూవీ కూడా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతోంది…