Chikiri Chikiri Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రానికి ఇప్పుడు గ్లోబల్ రేంజ్ గుర్తింపు లభిస్తోంది. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదలైన ‘చికిరి..చికిరి'(#ChikiriChikiri) పాట ఎంత పెద్ద సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ పాట నే కనిపిస్తోంది, వినిపిస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ లో షార్ట్స్ అయితే కనీవినీ ఎరుగని రేంజ్ లో అప్లోడ్ చేస్తున్నారు నెటిజెన్స్. కేవలం యూట్యూబ్ నుండి ఈ పాట మీద 2 లక్షల 15 వేల షార్ట్స్ వచ్చాయి. ఇక ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఇప్పటి వరకు లక్ష 38 వేల రీల్స్ వచ్చాయి. ఇక ఈ పాటకు వచ్చిన వ్యూస్ విషయానికి వస్తే, యూట్యూబ్ లో తెలుగు వెర్షన్ కి 60 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.
అదే విధంగా హిందీ వెర్షన్ లో ఇప్పటి వారికి 24 లక్షల వ్యూస్ వచ్చాయి. రోజుకి 7 లక్షల నుండి 10 లక్షల వ్యూస్ నమోదు అవుతున్నాయి. ఈ పాట కేవలం ఇండియా వరకే పరిమితం అయ్యింది అనుకుంటే పొరపాటే. ఖండాలు దాటేసింది. ఉదాహరణకు టిక్ టాక్ లో ఇప్పటి వరకు ఈ పాట పై 24 వేలకు పైగా వీడియో రీల్స్ అప్లోడ్ అయ్యాయి. టిక్ టాక్ మన ఇండియా లో బ్యాన్ అయ్యి నాలుగేళ్లు కావొస్తుంది. కేవలం ఫారిన్ దేశాల్లో మాత్రమే టిక్ టాక్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇప్పుడు వాళ్ళే ఈ వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. ఉదాహరణకు టిక్ టాక్ లో ‘కిలి పాల్’ అనే పాపులర్ సెలబ్రిటీ ‘చికిరి..చికిరి’ పాటకు స్టెప్పులు వేస్తూ కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది. మన తెలుగు బాషా తెలియని ఒక పాపులర్ సెలబ్రిటీ, చికిరి చికిరి పాటకు స్టెప్పులు వేసాడంటే, ఏ రేంజ్ లో ఈ పాట వైరల్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
రాబోయే రోజుల్లో ఈ పాట ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టించబోతుందో చూడాలి. ఒకే ఒక్క పాట పెద్ది చిత్రం పై అంచనాలు ఎవ్వరూ ఊహించనంత ఎత్తుకి తీసుకెళ్లి పెట్టింది. ఇదే అంచనాలను రెట్టింపు చేసే విధంగా తదుపరి ప్రమోషనల్ కంటెంట్ కూడా ఉంటే, ఈ సినిమాకు ఓపెనింగ్స్ లో ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అందుకు తగ్గ టాక్ వస్తే, ఈసారి రామ్ చరణ్ ఏకంగా వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి నెంబర్ 1 స్థానం లో కూర్చుంటాడు. చూడాలి మరి ఈ సినిమా రేంజ్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది.