https://oktelugu.com/

Mahesh Babu: హీరో ధనుష్ దర్శకత్వం లో మహేష్ హీరోగా మిస్ అయిన బ్లాక్ బస్టర్ చిత్రం అదేనా..? చేసుంటే వేరే లెవెల్ లో ఉండేది!

రీసెంట్ గా మన టాలీవుడ్ లో ఆయన 'సార్' చిత్రం తో ఎంట్రీ ఇచ్చి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అలా కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలలో భారీ హిట్స్ ని అందుకొని నిజమైన పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకున్న ధనుష్, హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 17, 2024 / 05:17 PM IST

    Mahesh Babu(3)

    Follow us on

    Mahesh Babu: మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అద్భుతమైన నటులుగా పేరు తెచ్చుకున్న వారిలో ఒకడు ధనుష్. ఈయన చేయలేని క్యారక్టర్ అంటూ ఏది లేదు, ఎలాంటి పాత్రని అయిన అలవోకగా చేసి జీవించగలడు. అందుకే ఆయనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. డోర్ టు నెక్స్ట్ బాయ్ రోల్స్ కి ధనుష్ రోల్ మోడల్ లాంటి వాడు. ఆయన పోషించే పాత్రలు చూస్తే మనల్ని మనం వెండితెర మీద చూసుకున్నట్టుగా అనిపిస్తాది. అందుకే ధనుష్ కి యూత్ లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆయన తన టాలెంట్ ని కేవలం తమిళ చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం చేయలేదు. పదేళ్ల క్రితమే ‘రంజానా’ అనే హిందీ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని, ఆరోజుల్లోనే బాలీవుడ్ లో వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను సాధించిన హీరో గా చరిత్ర సృష్టించాడు.

    ఇక రీసెంట్ గా మన టాలీవుడ్ లో ఆయన ‘సార్’ చిత్రం తో ఎంట్రీ ఇచ్చి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అలా కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలలో భారీ హిట్స్ ని అందుకొని నిజమైన పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకున్న ధనుష్, హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కీలక పాత్ర పోషించిన ‘ది గ్రే మ్యాన్’ అనే హాలీవుడ్ యాక్షన్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో నేరుగా విడుదలై మంచి రివ్యూస్ ని దక్కించుకుంది. అలా నటుడిగా అంతటి స్థాయికి ఎదిగిన ధనుష్, రీసెంట్ గానే దర్శకుడిగా మారి ‘రాయన్’ అనే చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో ధనుష్ హీరో గా కూడా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద సూపర్ హిట్ అయ్యింది. అయితే ధనుష్ కి డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన ఇప్పటిది కాదు, చాలా ఏళ్ళ క్రితమే అనుకున్నాడు.

    ఆయన కెరీర్ లో ‘రఘువరన్ బీటెక్’ అనే చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని అప్పట్లో తెలుగు లో ముందుగా రీమేక్ చేద్దాం అనుకున్నారు. మహేష్ బాబు తో చేయాలని ప్రయత్నం చేసారు. మహేష్ బాబు ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంటే, తానే దర్శకత్వం వహిస్తానని ధనుష్ చెప్పాడట. కానీ రీమేక్ సినిమాలు చేయడం ఇష్టం లేని మహేష్ బాబు ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకోలేదట. దీంతో ఆ సినిమాని తెలుగులోకి దబ్ చేసి విడుదల చేసారు. కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ధనుష్ ఈ చిత్రం తో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో అప్పటి నుండి ధనుష్ తన చిత్రాలను తెలుగు లో కూడా దబ్ చేసి విడుదల చేయడం మొదలు పెట్టాడు.