Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాను ఇష్టపడిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. దాని వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎంతటి నెగటివిటీ వచ్చినా ఆయన పట్టించుకోడు, నంద్యాల లో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే శిల్పా రవి తన స్నేహితుడు అవ్వడంతో, తన చిన్న మామయ్య జనసేన పార్టీ కి ఇబ్బంది కలుగుతుందేమో అని కూడా ఆయన ఆలోచించలేదు. పార్టీలతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను కేవలం నా మనుషులు కోసమే వచ్చాను అని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ ఆయన పై నెగటివిటీ ఆగలేదు. తాను ఎంత నెగటివ్ ని ఎదురుకున్నా చేయాలనుకున్నది చేసి తీరుతాను అంటూ మరోసారి వేరే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఇది ఆయనపై ఇంకా నెగటివిటీ ని పెంచింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకున్న మరో నిర్ణయం అభిమానులకు కోపాన్ని తెప్పించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరు. డిసెంబర్ 6 న విడుదల అవ్వబొయె ‘పుష్ప : ది రూల్’ చిత్రం తో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా కొల్లగొట్టబోతున్నాడు. అన్నీ కుదిరితే ఆ చిత్రం 2000 కోట్ల రూపాయిలు కొల్లగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి స్టామినా ఉన్న చిత్రమది. అంత పెద్ద ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని పాన్ ఇండియన్ డైరెక్టర్ తోనే చేస్తాడని అనుకున్నారు. అట్లీ తో అల్లు అర్జున్ కొత్త సినిమా ఇప్పటికే ఖరారు అయ్యింది. ఈ చిత్రం ‘పుష్ప : ది రూల్’ విడుదలైన వెంటనే ప్రారంభం అవుతుంది అని అనుకున్నారు ఫ్యాన్స్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన కోసం అల్లు అర్జున్ అభిమానులు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. కానీ అల్లు అర్జున్ తదుపరి చిత్రాన్ని అట్లీ తో చేయడం లేదట. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడట. ఇదే ఇప్పుడు అభిమానుల్ని నిరాశకు గురి చేసిన సంఘటన.
అదేంటి అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ జులాయి, అలా వైకుంఠపురం లో వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు చేసాడు కదా, మళ్ళీ ఆయనతో సినిమా అంటే సంతోషించాలి కానీ బాధపడుతున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ త్రివిక్రమ్ పాన్ ఇండియన్ డైరెక్టర్ కాదు, అందులోనూ ఇప్పుడు ఆయన ఫామ్ లో లేడు. ఆయన గత చిత్రం ‘గుంటూరు కారం’ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ సినిమాలో ఒక్క సన్నివేశం కూడా త్రివిక్రమ్ సరిగా తియ్యలేదని మహేష్ అభిమానులు ఆరోపణలు చేసారు. అలాంటి ఫామ్ లో డైరెక్టర్ తో, కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు సినిమా చేయడం, కెరీర్ ని రిస్క్ లో పెట్టినట్టే అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.