Pawan Kalyan Bro Movie: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరికొన్ని గంటల్లో భారీ ట్రీట్ సిద్ధంగా ఉంది. బ్రో టీజర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. టీజర్ కి ముందే బ్రో టీం నుండి వస్తున్న పోస్టర్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. టీజర్ ప్రకటన పోస్టర్లో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఊరమాస్ గెటప్స్ లో అలరించారు.ముఖ్యంగా పవన్ లుంగీ కట్టులో వింటేజ్ పవన్ ని గుర్తు చేశాడు. కెరీర్ బిగినింగ్ లో పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రంలోని లుక్ ని పోలి ఉంది. పవన్ ఫ్యాన్స్ కి సదరు లుక్ బాగా నచ్చేసింది. నేడు మరొక స్టిల్ షేర్ చేశారు. టాప్ టు బాటమ్ బ్లాక్ ట్రెండీ వేర్లో ఉన్న పవన్ కళ్యాణ్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు.
బ్రో చిత్రం నుండి టీం వదిలిన ఓ లుక్ జల్సా మూవీలోని పవన్ ని జ్ఞప్తికి తెచ్చింది. పవన్ కళ్యాణ్ బెస్ట్ లుక్స్ లో జల్సా ఒకటి. దర్శకుడు త్రివిక్రమ్ తో పవన్ చేసిన మొదటి చిత్రం ఇది. జల్సా సూపర్ హిట్ కాగా అటు పవన్ కళ్యాణ్ మార్క్ మేనరిజమ్ యాక్షన్ తో పాటు త్రివిక్రమ్ మార్క్ కామెడీతో మూవీ కట్టిపడేసింది. బ్రో చిత్రానికి త్రివిక్రమ్ పని చేసిన విషయం తెలిసిందే. స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చారు.
బ్రో టీజర్ నేడు సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదల కానుంది. సాయి ధరమ్ తేజ్ స్టిల్ కూడా విడుదల చేశారు. టక్ ఇన్ లో ఎంప్లొయ్ గా సాయి ధరమ్ ఆకట్టుకున్నారు.తమిళ హిట్ మూవీ వినోదయ సితం రీమేక్ గా బ్రో తెరకెక్కింది. దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. థమన్ సంగీతం అందించారు.
పవన్ కళ్యాణ్ మేనరిజం, ఇమేజ్ కి తగ్గట్టు మూల కథలో మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ మోడ్రన్ గాడ్ గా కనిపించనున్నారు. ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. సాయి ధరమ్ తేజ్ మీద ప్రధానంగా కథ నడుస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన చిత్ర షూటింగ్ వాయువేగంతో పూర్తి చేశారు. జులై 28న బ్రో వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. అలాగే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్స్ చకచకా జరుగుతున్నాయి.
BIG #BRO We’ll take you back in TIME,
Bringing you Unprecedented Swag with #BroTeaser,Today @ 5:04PM @PawanKalyan @IamSaiDharamTej@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @lemonsprasad @peoplemediafcy @ZeeStudios_ @zeestudiossouth #BROFromJuly28 pic.twitter.com/wxdCj3yIHW— P.samuthirakani (@thondankani) June 29, 2023