MLC Kaushik Reddy: తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి లేని తలనొప్పులు తెస్తున్నారు. వ్యక్తిగత నిర్ణయాలతో పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారు. తాజాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హత్యకు కుట్ర ఎపిసోడ్ బీఆర్‌ఎస్ పార్టీలో చర్చకు కారణమైంది. ఒకవపై ముదిరాజ్‌లను ధూసించాడని రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రోజకోరీతిలో నిసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఈటల హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన భార్య జమున ఆరోపించడం సంచలనంగా మారింది. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో బలం పెంచుకుని ఎన్నికలలో ఈటలను బలంగా ఢీ కొడతాడు అని భావించిన పాడి కౌశిక్‌రెడ్డి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్సీకి షాక్ ఇవ్వడానికి సీఎం రెడీ అయినట్లు సమాచారం.
హుజూరాబాద్ అభ్యర్థిగా ప్రకటించిన కేటీఆర్..
తెలంగాణ ముఖ్యమైన మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల జమ్మికుంటలో నిర్వహించిన సభలో హుజూరాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్‌రెడ్డిని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కౌశిక్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దీంతో కౌశిక్ అభ్యర్థిత్వాన్ని కేటీఆర్ కన్ఫామ్ చేశారు.
తాజా పరిణామాలతో..
వరుస వివాదాలతో కౌశిక్‌రెడ్డి హూజూరాబాద్ నియోజకవర్గంలో బలహీనపడుతున్నారు. సొంత పార్టీ నాయకులను బెదిరించడం, అధికారులతో దురుసుగా మాట్డాడంతోపాటు కులాలను కించపర్చేలా మాట్లాడడం, ఈటల హత్యకు కుట్ర లాంటి పరిణామాల నేపథ్యంలో హుజూరాబాద్‌లో కౌశిక్‌ను నిలిపినా గెలవడనే అభిప్రాయానికి గులాబీ బాస్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో హుజూరాబాద్ నుంచి కౌశిక్‌ను తప్పించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
తెరపైకి పెద్దిరెడ్డి…
ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి వివాదాలతో హుజూబాద్ బరి నుంచి ఆయనను తప్పించి ఈటలపై సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డిని బరిలో నిలపాలని గులాబీ బాస్ భావిస్తున్నారని తెలిసింది. పెద్దిరెడ్డికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని కేసీఆర్ ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.
ఈటలను ఓడించాలని..
హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజేందర్‌కు మంచి పట్టు ఉంది. ఆయనను ఓడించటానికి ప్రజాక్షేత్రంలో పనిచేసి ప్రజల మనసు గెలుచుకొని ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టాలని బీఆర్‌ఎస్ భావించింది. అయితే ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్‌గా మంచి అవకాశం వచ్చిన పాడి కౌశిక్‌రెడ్డి చేయాల్సిన పనులు కాకుండా, వివాదాలలో తలదూర్చడం అధిష్టానానికి ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ క్రమంలోనే పాడి కౌశిక్‌రెడ్డికి గట్టి షాక్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది.