Tarun vs Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సూపర్ సక్సెస్ లను సాధిస్తారు. సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఆ సక్సెస్ లను కంటిన్యూస్ గా సాధిస్తూ ముందుకు సాగడం అంతే ముఖ్యం. అందులో ఏమాత్రం తేడా జరిగిన కూడా వాళ్ళ మార్కెట్ పడిపోవడంతో పాటు వాళ్ళ క్రేజ్ కూడా తగ్గిపోతుంది. తద్వారా వాళ్లు ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఇండస్ట్రీలో ఎవరి కెరియర్ ఎంత కాలం పాటు కొనసాగుతుంది అనేది ఎవరు చెప్పలేరు. సక్సెస్ ఫుల్ సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తే మాత్రం వాళ్లు చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో తమ మనుగడను కొనసాగించే అవకాశాలైతే ఉన్నాయి…
ఇక కెరియర్ స్టార్టింగ్ లో తరుణ్ చాలా మంచి సినిమాలను చేసి సక్సెస్ లను సాధించి స్టార్ హీరోలకు సైతం పోటీని ఇచ్చాడు. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు సూపర్ సక్సెస్ లను సాధించిన కూడా తరుణ్ కి ఉన్న క్రేజ్ అంతా కాదు. అప్పట్లో అతన్ని లవర్ బాయ్ గా పిలిచేవారు. చాలామంది యూత్ అతనికి అభిమానులుగా మారిపోయారు.
అలాంటి తరుణ్ తర్వాత చేసిన సినిమాల విషయంలో చాలా పెద్ద తప్పులు చేశాడు. కథ సెలెక్షన్లో లోపాలు ఉండటమే కాకుండా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి ప్రేక్షకులను విసుగెత్తించాడు. తద్వారా అతను ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నప్పటికి ఆయనకు సరైన కథ దొరకడం లేదు.
ఇక ఏది ఏమైనా కూడా తరుణ్ ఇప్పుడు మరోసారి తన స్టామినాను చాటుతాడా? ఇప్పుడున్న హీరోలతో పోటీపడే కెపాసిటి అతనికి ఉందా? అనేది తెలియాల్సి ఉంది. తను హీరో గానే చేస్తాడా? లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సైతం పలు పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…మరి తనకి అవకాశం ఇచ్చే దర్శకుడు ఎవరు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
