Bandaru Sravani: ఏపీలో( Andhra Pradesh) లడ్డూ వివాదం ఒక వైపు కొనసాగుతోంది. అధికార విపక్షాల మధ్య ఒక రకమైన యుద్ధం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే క్షుద్ర పూజల కలకలం రేగింది. అధికార టీడీపీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే పై బ్లాక్ మ్యాజిక్ కు యత్నించినట్టు ఒక్కసారిగా వార్తలు హల్చల్ చేశాయి. ఏపీలో ఈ ఘటన తీవ్ర కలకలానికి దారితీసింది. మూఢ నమ్మకాలను విశ్వసించేవారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. తమ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు క్షుద్ర పూజలు వంటి వాటిని ఆశ్రయిస్తుంటారు. ఇటువంటి ఘటనలు నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఓ మహిళ ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకొని క్షుద్ర పూజలు ప్రయోగించారని తెలియడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.
* కారులో వచ్చి.. అనంతపురం( Ananthapuram district) జిల్లా సింగనమల నియోజకవర్గానికి చెందిన టిడిపి మహిళా ఎమ్మెల్యే బండారు శ్రావణి పై కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలకు ప్రయత్నించారని తెలుస్తోంది. నిన్న ఉదయం కొంతమంది స్విఫ్ట్ కారులో వచ్చి ఎమ్మెల్యే శ్రావణి ఇంటి ముందు నిమ్మకాయలు, తెల్ల నువ్వులు విసిరేశారు. దీనిని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు.. కారు వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. అప్పటికే వారు పారిపోయారు. కాగా ఆ కారు నెంబర్ ఏపీ 39 kx 0986 గా గుర్తించారు. గుంటూరుకు చెందిన ఓ మహిళ పేరిట అది రిజిస్టర్ అయినట్లు సమాచారం.
* అనేక అనుమానాలు..
అయితే ఇటీవల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. తాజాగా ఈ ఘటనపై స్పందించారు ఎమ్మెల్యే శ్రావణి. ఇది తెలిసిన వారి పనేనని ఆరోపించారు. గత కొద్దిరోజులుగా తనపై ఇలాంటి ప్రయోగం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే క్షుద్ర పూజల కుట్ర వెనుక తమ నియోజకవర్గానికి చెందిన ఓ అసంతృప్త నేత హస్తం ఉండొచ్చని ఎమ్మెల్యే వర్గం అనుమానిస్తోంది. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
