Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన నటుడు మహేష్ బాబు… ఆయన కెరియర్ మొదట్లోనే వరుస సక్సెస్ లను అందుకున్నాడు. ఒక్కడు సినిమాతో తనకు మాస్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత అతడు సినిమాతో చాక్లెట్ బాయ్ గా అవతరించాడు. పూరి జగన్నాథ్ చేసిన పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించాడు. అప్పటినుంచి వెను తిరిగి చూడకుండా స్టార్ హీరోల్లో ఒకడిగా ముందుకు దూసుకెళ్తున్న మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు సినిమాల్లో తన తండ్రి పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
తను చేసిన ‘రాజకుమారుడు’ మూవీ నుంచి చివరగా వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా వరకు ఆయన సినిమాల్లో తండ్రి పాత్రలు చాలా బలంగా ఉంటాయి… ఇక తమిళంలో స్టార్ హీరో అయిన రజినీకాంత్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అలాంటి రజనీకాంత్ తో నటించడానికి మహేష్ బాబు రెండు సార్లు ప్రయత్నించాడు. కానీ అనుకోని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు.
ఇంతకీ ఆ క్యారెక్టర్లు ఏంటి అంటే దూకుడు సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం మొదట రజనీకాంత్ ని అనుకున్నారు. కానీ ఆయనకి ఆ క్యారెక్టర్ నచ్చకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేశాడు. ఆ మూవీ సూపర్ సక్సెస్ ను సాధించింది. ఇక ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు – వెంకటేష్ హీరోలుగా వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో సైతం వెంకటేష్ – మహేష్ బాబు ఫాదర్ గా రజనీకాంత్ చేత నటింపజేయాలని అనుకున్నారట.
ఇక ఆ పాత్ర రజినీకాంత్ కి బాగా నచ్చినప్పటికి వెంకటేష్ – మహేష్ బాబు ఇద్దరు స్టార్ హీరోలతో తను నటిస్తే ఆ సినిమా మీద అంచనాలు తార స్థాయికి వెళ్ళిపోతాయని దాంతో ప్రేక్షకులు ఆ సినిమాను సరిగ్గా రిసీవ్ చేసుకోలేరేమో అనే ఉద్దేశ్యంతోనే రజనీకాంత్ ఆ సినిమాను వదులుకున్నాడు. మొత్తానికైతే మహేష్ బాబు – రజనీకాంత్ కాంబినేషన్లో రెండు సినిమాలు వస్తాయనుకుంటే ఒక్కటి కూడా రాకపోవడం వాళ్లిద్దరి అభిమానులను బాధిస్తోంది. ఇక ఫ్యూచర్ లో అయిన వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తుందేమో చూడాలి…