Balakrishna And Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి సీనియర్ హీరోగా చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ భారీ విజయాలను సాధిస్తున్నాయి. ఇక ఇప్పటివరకు వరుసగా 5 విజయాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే రైటర్ గా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరియర్ స్టార్టింగ్ లో బాలయ్య బాబుతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. నిజానికి బాలయ్య త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేయాలని కొంతమంది నిర్మాతలు సైతం ఆసక్తి చూపించారు. మరికొందరు వీళ్ళ కాంబో అసలు సెట్ అవ్వదు.
బాలయ్య మాస్ హీరో త్రివిక్రమ్ ఫ్యామిలీ కామెడీ మూవీస్ కి పెద్ద పీట వేస్తాడు. కాబట్టి వీళ్లకు సెట్ అవ్వదు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ మాత్రం బాలయ్య బాబు ఫార్మాట్లలోనే ఒక మాస్ కమర్షియల్ సినిమా చేయాలని అనుకున్నారట. అలాగే బాలయ్య చేత కామెడీ చేయిస్తే కూడా అది బాగా వర్కౌట్ అవుతుందని అనుకున్నారు.
ఇక ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే కామెడీకి పెద్దపీట వేయాలని చూశాడు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలైతే ఎక్కలేదు. మొత్తానికైతే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అదొక ట్రెండ్ సెట్టర్ గా నిలిచేదని సినిమా మేధావులు సైతం గతంలో వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు…
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా త్రివిక్రమ్ చేసే సినిమాలకు గొప్ప గుర్తింపైతే ఉంటుంది. ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ను తెరకెక్కిస్తున్నాడు… ఇక ఇప్పటివరకు త్రివిక్రమ్ చేసిన సినిమాలు అతనికి నెక్స్ట్ లెవెల్ గుర్తింపైతే ఇచ్చాయి. ఇక మరోసారి తనను తాను ఎలివేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..