Actress Jeevitha Rajasekhar: డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. హ్యాపీగా ఒక ఏసీ గదిలో కూర్చొని సైబర్ నేరగాళ్లు కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారు. వాళ్ళ చేతిలో మోసపోయిన అమాయకులు తర్వాత లబో దిబో మన్నా ప్రయోజనం ఉండటం లేదు. తాజాగా నటి జీవిత రాజశేఖర్ టార్గెట్ గా సైబర్ నేరగాడు పెద్ద స్కెచ్ వేశాడు. ఆమె జస్ట్ మిస్ కావడంతో మేనేజర్ చిక్కుకున్నాడు. వివరాల్లోకి వెళితే కొద్దిరోజుల క్రితం జీవిత రాజశేఖర్ కి ఒక అజ్ఞాత వ్యక్తి నుండి కాల్ వచ్చింది. అతడు తనని తాను షారుక్ అని పరిచయం చేసుకున్నాడు. తాను జియో సంస్థలో పనిచేస్తాను, అని ఏదో చెప్పబోతుంటే నేను బిజీగా ఉన్నాను.. నా మేనేజర్ తో మాట్లాడమన్నారట.

షారుక్ అనే వ్యక్తి జీవిత రాజశేఖర్ మేనేజర్ తో మాట్లాడాడు. నాకు జియో సంస్థలో పదోన్నతి వచ్చింది. ఈ క్రమంలో జియో సంస్థ ద్వారా విక్రయించబడుతున్న వస్తువులు ఏవైనా మీకు 50 % డిస్కౌంట్ తో ఇస్తాను అన్నాడట. మేనేజర్ కి విశ్వాసం కలిగేందుకు కొన్ని స్క్రీన్ షాట్స్ షేర్ చేశాడట. సదరు స్క్రీన్ షాట్స్ లో రూ. 2.5 లక్షలు విలువ చేసే వస్తువులు రూ. 1.25 లక్షలకే ఇస్తున్నట్లు ఉందట. పూర్తిగా నమ్మిన మేనేజర్ షారుక్ కి రూ. 1.25 లక్షలు ఆన్లైన్లో చెల్లించాడట.
Also Read: Anasuya Bharadwaj: వైరల్ గా అనసూయ మేకప్ లెస్ లుక్… ఒరిజినల్ గా ఇలా ఉంటుందా?
డబ్బు చెల్లించి రోజులు గడుస్తున్నా వస్తువు రాకపోవడంతో పాటు షారుక్ స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించాడట. అతనితో మాట్లాడిన ఫోన్ నెంబర్, బ్యాంకు డీటెయిల్స్ సమర్పించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు ఆచూకి తెలిసింది. చెన్నైకి చెందిన నాగేంద్రబాబు ఈ నేరానికి పాల్పడ్డారని గ్రహించిన పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.

కాగా నాగేంద్రబాబు పెద్ద కేటుగాడని పోలీసులు నిర్ధారించారు. గతంలో కూడా పలు నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని, నిర్మాతలకు అవార్డులు ఇప్పిస్తానని కూడా మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు. ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో కొన్నాళ్ళు పాటు చెఫ్ గా పని చేశాడని తెలియజేశారు. పెద్ద తలకాయ జీవితానే నాగేంద్రబాబు టార్గెట్ చేశాడు. అనుకోకుండా ఆమె మేనేజర్ వలలో చిక్కుకున్నాడు. లక్ష రూపాయలు పైగా మోసపోయాడు. జనాల అత్యాశే మోసగాళ్లకు పెట్టుబడిగా మారుతుంది. జీవితా సైతం పలు ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొనడం కొస మెరుపు.
[…] […]
[…] […]
[…] […]