https://oktelugu.com/

Samantha Naga Chaitanya: మీడియా ముందుకి రాబోతున్న సమంత..నాగ చైతన్య కి ఊహించని షాక్

Samantha Naga Chaitanya: సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత మరియు నాగ చైనత్య విడాకులు తీసుకున్న సంఘటన కేవలం వాళ్ళిద్దరి అభిమానులకే కాదు..ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, వీళ్లిద్దరు విడాకులు తీసుకున్న సంగతి వాళ్ళు అయిన మర్చిపొయ్యి ఉండొచ్చు ఏమో కానీ మీడియా మాత్రం ఇప్పటికి మర్చిపోలేదు..ఇప్పటికి కూడా రోజు ఎదో ఒక్క వార్త వీళ్లిద్దరి గురించి సోషల్ మీడియా లో ప్రచారం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 13, 2022 / 02:28 PM IST
    Follow us on

    Samantha Naga Chaitanya: సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత మరియు నాగ చైనత్య విడాకులు తీసుకున్న సంఘటన కేవలం వాళ్ళిద్దరి అభిమానులకే కాదు..ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, వీళ్లిద్దరు విడాకులు తీసుకున్న సంగతి వాళ్ళు అయిన మర్చిపొయ్యి ఉండొచ్చు ఏమో కానీ మీడియా మాత్రం ఇప్పటికి మర్చిపోలేదు..ఇప్పటికి కూడా రోజు ఎదో ఒక్క వార్త వీళ్లిద్దరి గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉన్నాయి..ఇది పక్కన పెడితే ఇప్పుడు సమంత మళ్ళీ మీడియా ముందుకు రాబోతుంది అనే వార్తలు రావడం తో మల్లి సోషల్ మీడియా అంతటా సమంత నాగ చైతన్య టాపిక్స్ తో నిండిపోయింది..సమంత మీడియా ముందుకు ఎందుకు వస్తుంది?,తన విడాకుల గురించి ఏదైనా వార్త అభిమానులకు చెప్పబోతుందా, మళ్ళీ వాళ్లిదరు అధికారికంగా ఒక్కటి అవ్వబోతున్నారా !, అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవ్వడం మొదలు పెట్టాయి.

    Samantha Naga Chaitanya

    అయితే సమంత మీడియా ముందుకు రాబోతుంది అనే వార్త నిజమే..కానీ అది ఆమె వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి కాదు..తమిళ్ లో ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘కాతు వాకుల రెండు కాథాల్’ అనే సినిమా ప్రొమోషన్స్ కోసం మీడియా ముందుకు రాబోతుంది, విజయ్ సేతుపతి హీరో గా నటించిన ఈ సినిమాలో నయనతార కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది..నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, నయనతార ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం విశేషం..షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది, సాదరంగా సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపని నయనతార ఇది తన సొంత సినిమా అవ్వడం తో ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా సమంత ని కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొనేందుకు ఒప్పించింది,ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

    Samantha Naga Chaitanya

    Also Read: బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హవా..!

    ఇది ఇలా ఉండగా చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వస్తున్న సమంత ని విలేకరులు నాగ చైతన్య తో విడాకులు జరిగిన సంఘటన గురించి కచ్చితంగా అడుగుతారు అనే విషయం ఇప్పుడు ఫిలిం నగర్ లో జరుగుతున్న చర్చ..గతం లో లవ్ స్టోరీ మరియు బంగార్రాజు సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొన్న నాగ చైతన్య ని కూడా ఇలా మీడియా వాళ్ళు విడాకులకు సంబంధించిన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేసారు..కానీ నాగ చైతన్య వాటికి చాలా కూల్ గా సమాదానాలు చెప్పి ఎలాంటి కాంట్రవర్సీ చెయ్యలేదు, కానీ సమంత ని కూడా అవే ప్రశ్నలు అడిగితె ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఇక చూడాలి మరి మీడియా నుండి ఎదురు అయ్యే అలాంటి ప్రశ్నలను సమంత ఎలా ఎదురుకుంటుందో అనేది..ఈ సినిమా తో పాటుగా సమంత యశోద మరియు శాకుంతలం వంటి భారీ బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అంతే కాకుండా హాలీవుడ్ లో కూడా ఆమెకి నటించే అవకాశం దక్కింది..విడాకులు తర్వాత వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు దక్కించుకుంటున్న సమంత కెరీర్ సక్సెస్ వైపు పోతున్న ఫెయిల్యూర్ వైపు పోతుందా అనేది చూడాలి.

    Also Read: చిరు, చరణ్ ను భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. ఆచార్య విషయంలో ఆందోళన

    Tags