Cricketers Who Got Divorced: ఈ కాలంలో ఎంత త్వరగా పెండ్లి చేసుకుంటున్నారో.. అంతే త్వరగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి సాంప్రదాయం మనకు ఎక్కువగా సినీ పరిశ్రమలోనే వినిపిస్తుంది. కానీ క్రికెట్ ఇండస్ట్రీలో కూడా చాలామంది విడిపోతున్నారు. అలా భార్యలకు విడాకులు ఇచ్చిన 10మంది క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ముందుగా చెప్పుకోవాల్సింది దినేశ్ కార్తీక్ గురించి. ఈయన తన చిన్ననాటి స్నేహితురాలు నిఖితను పెండ్లి చేసుకున్నాడు. కానీ ఆమె మరో క్రికెటర్ మురళీ విజయ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో దినేశ్ ఆమెకు విడాకులు ఇచ్చి ప్రముఖ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత నిఖిత, మురళి విజయ్ లు కూడా పెళ్లి పీటలెక్కారు.

టీమిండియా గబ్బర్ అయిన శిఖర్ ధావన్ మొదటి భార్యతో విడిపోయిన తర్వాత నటి ఆయేషా ముఖర్జీని మ్యారేజ్ చేసుకున్నాడు. కానీ రీసెంట్ గా వీరు కూడా విడిపోయారు.

ప్రముఖ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మొదట తన చిన్న నాటిఫ్రెండ్ అయిన నోయెల్లా లూయిస్ ను మ్యారేజ్ చేసుకున్నాడు. కానీ మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. మోడల్ ఆంద్రియాని అతను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు.
Also Read: IPL 2022: ఆర్సీబీ కప్ కొట్టేదాకా నో మ్యారేజ్ అంటున్న పిల్ల.. ఈ జన్మలో కాదంటున్న నెటిజన్లు..
టీమ్ ఇండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ పరిస్థితి కూడా ఇదే. ఆయన చీర్ లీడర్ అయిన హసీన్ జహాన్ ని మ్యారేజ్ చేసుకున్నాడు. గొడవల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. వీరి విడాకులు అప్పట్లో చాలా సంచలనం రేపాయి.

ఒకప్పటి మేటి క్రికెటర్ సనత్ జయసూర్య సుముధు అనే అమ్మాయిని 1998లో మ్యారేజ్ చేసుకుండు. కానీ ఏడాదికే విడిపోయారు. ఆ తర్వాత మరో సంవత్సరంలో సాండ్రా అనే అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆమెతో 20ఏండ్ల కాపురం తర్వాత 2021లో విడాకులు తీసుకున్నాడు.

పాకిస్థాన్ ఫేమస్‌క్రికెటర్ షోయబ్ మాలిక్ మొదటగా అయేషా సిద్ధిఖీ అనే అమ్మాయిని వివాహం చేసుకుని విడిపోయారు. ఆ తర్వాత టెన్నీస్ స్టార్ సానియా మీర్జాని 2010లో పెండ్లి చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ బ్రెట్ లీ 2006లో ఎలిజబెత్ ను మ్యారేజ్ చేసుకున్నాడు. కానీ రెండేళ్లకే ఆమెతో విడాకులు తీసుకుని.. 2014లో లానా అండర్సన్ తో సెకండ్ మ్యారేజ్ జరుపుకున్నాడు.

మహమ్మద్ అజారుద్దీన్ కూడా మొదటగా నౌరీన్ ను పెండ్లి చేసుకుని విడిపోయారు. ఆ తర్వాత 1996 లో సంగీతా బిజ్లానీతో మరో పెండ్లి చేసుకున్నాడు.

జవగళ్ శ్రీనాథ్ కూడా అంతే. ఆయన మొదట జోత్స్నా తో పెండ్లి చేసుకుని విడిపోయారు. మాధవి అనే జర్నలిస్ట్ ని రెండో పెండ్లి చేసుకుని కలిసి ఉంటున్నారు.

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ కూడా ఒకప్పటి క్రికెటర్. ఆయన మొదటి భార్య, యువరాజ్ సింగ్ తల్లి అయిన షబ్నం సింగ్ ను మొదటి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో విడిపోయి సత్వీర్ కౌర్ ను రెండో వివాహం చేసుకున్నాడు.
Also Read:IPL 2022: 4 మ్యాచ్‌లు ఓడినా టైటిల్ గెలిచిన ముంబై.. ఈ సారి ఆ మ్యాజిక్ చేస్తుందా..?