Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఈ సారి కొత్తగా మొదలైన విషయం తెలిసిందే. ఎంతో మంది ఎదురుచూపుల మధ్య వచ్చిన ఈ సీజన్ ప్రేక్షకులను అలరించడంలో బాగానే సాగుతుంది. కానీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కావడం లేదని కొందరి టాక్. ఇక మొత్తం మీద ఉల్టా ఫుల్టా, ఈ సారి కొత్తగా సరికొత్తగా అంటూ వచ్చారు కింగ్ నాగార్జున. ఐదు వారాలలో ఐదు గురు వెళ్లిపోయాక మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్లని వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇప్పించారు. భోలే షావలి, అశ్విని, అంబటి అర్జున్, నయని పావని, పూజా మూర్తి హౌజ్‌లోకి అడుగుపెట్టారు.
ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన వారికి నాగార్జున పోటు గాళ్లు అనే పేరు పెట్టారు. కొత్త వారితోపాటు పాత వారు కూడా హౌజ్‌లో కన్ఫమ్ అయినట్టుగా తెలిపారు. అయితే సోమవారం ఎపిసోడ్‌లో అసలు ఆట ప్రారంభమైంది. కొత్తగా వచ్చిన వారు నామినేషన్ల ప్రక్రియలో పాతవారిని ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి గట్టి ఎదురుదెబ్బలు ఎదురయ్యాయి. పాత తప్పులనే మిస్టేక్స్ గా చూపి నామినేట్ చేయడం విచిత్రంగా అనిపించింది.
కౌంటర్లు ప్రతి కౌంటర్ల లాగా సాగుతుంది ఈ కొత్త సభ్యులతో ఎంట్రీ. తేజని నయని పావని నామినేట్ చేసి.. నీ గేమ్ నువ్వు ఆడడం లేదన్నట్టు అనిపిస్తుంది అని తన మనుసులో మాట తెలిపింది. దానికి కౌంటర్ గా గేమ్ లు ఆడటమే ముఖ్యం కాదు, ఎంటర్టైన్మెంట్స్ కూడా చేయాలి అని నయనికి కౌంటర్ ఇచ్చాడు తే. దానికి ఆమె కవర్ చేస్తూ డిజర్వ్ కాని వారి పేరు చెప్పాను అని మాట దాటేసింది.
భోలే షావలి కూడా సందీప్ ని నామినేట్ చేస్తూ బెల్ట్ టాస్క్ గురించి గుర్తు చేసింది. ఆపాల్సింది మీరే కానీ మీరు రియాక్ట్ అవలేదు అని నామినేట్ చేసింది. దానికి బదులుగా బయటకు వచ్చి అరిచాను కదా అని సందీప్ అంటే.. ఎలాంటి ఆన్సర్ చేయలేక పోయింది భోలే షావలి. ఈమె మాత్రమే కాదు ఇదే రీజన్ చెబుతూ తేజను నామినేట్ చేసింది పూజా మూర్తి.
అమర్ దీప్ ని అశ్విని నామినేట్ చేస్తూ.. సెల్ఫిష్ గా ఆడారు అని అంటే.. దానికి సమాధానంగా అవును ఈ ఆట అలాగే ఆడాలి సెల్ఫిష్ గానే ఆడాలి అంటూ సమాధానం చెప్పాడు అమర్. ఇదే నా ఆట. ఇక్కడికి నాకోసం నేను వచ్చాను అని అనడంతో అశ్విని నోటి నుంచి మాట రాలేదు. ఇక శోభా శెట్టిని గ్రూపిజం అంటూ నామినేట్ చేసింది. దానికి గ్రూపిజం అంటే ఏంటి? దీని వల్ల మీరేమైన నష్టపోయారు? ఏమో మీకు రేపు ఆ పరిస్థితి రావచ్చేమో అంటూ బదులివ్వగా.. అశ్విని వద్ద దీనికి కూడా ఆన్సర్ లేదు.
మొత్తం మీద ఈ వారం అమర్ దీప్, సందీప్, తేజ, ప్రిన్స్ యావర్ తో పాటు కొత్త వాళ్లు అశ్విని, నయని పావని, పూజా మూర్తి కూడా నామినేట్ అయ్యారు అని తెలుస్తోంది. మరి ఇందులో ఎవరు ఇంటికి వెళ్తారో? ఎవరు బిగ్ బాస్ ఇంట్లో ఉంటారో తెలియాలంటే వచ్చే వారం వరకు ఎదురుచూడాల్సిందే.