Rohit Sharma: ఇండియన్ క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూసిన వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇండియా ఒక మ్యాచ్ లో ఆడి ఆస్ట్రేలియా మీద ఘన విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. అయితే ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఇండియా ఈజీగా ఈ మ్యాచ్ ని గెలిచేసింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇండియా టీంలో అత్యద్భుతమైన ప్లేయింగ్ లెవన్ రెడీ అయి ఈ స్థాయికి రావడానికి ఇండియన్ ప్లేయర్ లందరూ కూడా చాలా కష్టపడ్డారు.
ఈరోజు ప్రపంచ నెంబర్ వన్ టీమ్ గా ఇండియా ఉంది అంటే దాని వెనక చాలా కష్టం ఉంది.ఇక ప్లేయర్లు ఒక్కొక్కరికి చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ అలాగే వాళ్ల ద్వారా టీం కి అండదండ కావాలి అనే ఉద్దేశ్యం తో వరల్డ్ కప్ లో సెలెక్ట్ అయిన ప్లేయర్లు అందరూ కూడా విజయం కోసం వాళ్ల శాయ శక్తుల ట్రై చేసి ప్రాణం పెట్టీ మ్యాచ్ ఆడుతున్నారు. ఒక్క ప్లేయర్ అని చెప్పడం కాదు కానీ టీమ్ లో ఉన్న అందరూ ప్లేయర్లు చాలా అద్బుతం గా ఆడుతూ ఇండియన్ టీమ్ ప్లేయింగ్ లెవన్ మొత్తం అద్భుతంగా ఉంది అంటూ అందరి చేత కీర్తించబడుతున్నారు…అలాగే అందరూ కూడ చాలా బాగా ఆడుతున్నారు.ప్రస్తుతం ఇండియాని ఓడించడం అంటే అంత ఈజీ కాదు అనే విషయం ప్రపంచ దేశాలన్నింటికీ అర్థం అయిపోయింది.అయితే ఆస్ట్రేలియా తో ఆడిన మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇద్దరు కలిసి వేసిన ఒక ప్లాన్ ద్వారా ఆస్ట్రేలియా టీమ్ ని ట్రాప్ లో పడేశారు. అది ఏంటి అంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్లు స్పిన్నర్లని ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడతారు.అది తెలుసుకున్న కోచ్ రాహుల్ ద్రావిడ్ ,కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ కలిసి టీమ్ లో ముగ్గురు స్పిన్నర్లు ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారు.
అందులో భాగంగానే రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్డిప్ యాదవ్ లాంటి ముగ్గురు అనుభవం ఉన్న స్పిన్నర్లు ఉండడం టీం కి చాలా వరకు కలిసి వచ్చింది. ఇక ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు ఆయన ఐపీఎల్ ల్లో ముంబై టీం కి ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించాడు.ఇక ఆ అనుభవంతోనే వరల్డ్ కప్ లో కూడా తనదైన కెప్టెన్సీ చేస్తూ ప్రత్యర్థి జట్టుకి వణుకు పుట్టిస్తున్నాడు. 2011లో వరల్డ్ కప్ అనేది ఇండియాలోనే ఆడడం జరిగింది ఆ టైం లో ధోని కెప్టెన్ గా ఉన్నాడు. అప్పుడు ఇండియానే వరల్డ్ కప్ గెలిచింది. అదే ఇండియా టీం కి వచ్చిన చివరి వరల్డ్ కప్ కాబట్టి ఇప్పుడు వరల్డ్ కప్ కొట్టి ఇండియా తన సత్తా ఏంటో చూపించాలి అని చూస్తుంది.ఇక ఇప్పటికే రెండు సార్లు ఇండియా కప్పు కొట్టింది కాబట్టి ఈసారి వరల్డ్ కప్ కొడితే ఇండియాకి మూడుసార్లు వరల్డ్ కప్ వచ్చినట్టుగా ఒక రికార్డుని క్రియేట్ చేస్తుంది… అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ఆడుతున్న ఇండియా టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఈసారి కూడా వరల్డ్ కప్ మనదే అని చాలా మంది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే రెండు.మూడు మ్యాచ్ లు గడిస్తే కానీ ఏ టీమ్ పరిస్థితి ఏంటి అనేది తెలియదు కాబట్టి ఈసారి మన ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ కొడుతుందా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొన్ని మ్యాచ్ లు గడవాలి…ఇక ఇది ఇలా ఉంటే ఆస్ట్రేలియా మ్యాచ్ లో రవీంద్ర జడేజా వరుసగా వేసిన 10 బంతుల్లో మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్స్ ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు…ఇక మొత్తం గా 10 ఓవర్లు వేసిన ఆయన 28 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు.అలాగే కుల్దిప్ యాదవ్ పదోవర్లు వేసి 42 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ కూడా 10 ఓవర్లు వేసి 34 రన్స్ వచ్చి ఒక వికెట్ తీశాడు… ఇలా మన స్పిన్నర్ల మీద రోహిత్ శర్మ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన స్పిన్నర్లు ఆస్ట్రేలియాన్ బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేసి ఇండియాకి ఘనమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహించారు…