Homeప్రవాస భారతీయులుSri Sitaram's kalyanam in Canada : ‘తాకా’ ఆధ్వర్యంలో కెనడాలో అంగరంగ వైభవంగంగా ...

Sri Sitaram’s kalyanam in Canada : ‘తాకా’ ఆధ్వర్యంలో కెనడాలో అంగరంగ వైభవంగంగా శ్రీ సీతారాముల కళ్యాణం

Sri Sitaram’s kalyanam in Canada ::  తెలుగు అలయెన్సెస్ అఫ్ కెనడా (తాకా) వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. టొరంటోలోని శృంగేరి విద్యా భారతి ఫౌండేషన్ ఆడిటోరియంలో దాదాపు 600 మందికి పైగా భక్తులు దీనికి హాజరయ్యారు. మేళతాళాలు, కూచిపూడి నాట్యము, పాటలు, భజనలతో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిగింది.

ఆదివారం, ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 9 గంటలకు కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. తాకా అధ్యక్షులు కల్పన మోటూరి.. కార్యవర సభ్యులు, ట్రస్టీలు, మరియు వ్యవస్థాపక సభ్యులు ఉదయము 6 గంటలకు వేడుక వద్దకు చేరుకొని పానకము, వడపప్పు తయారు చేయగా, తాకా యువ కార్యకర్తలు స్వామి వారి పెళ్లి మందిరమును ఏర్పాటు చేశారు.

టొరంటో లోని, ప్రముఖ అర్ఛకులు  మంజునాథ్ సిద్ధాంతి  మరియు వారి శిష్య బృందంతో సుప్రభాత సేవ, అభిషేకం, షోడశోపచార పూజలతో స్వామి వారి కల్యాణాన్ని మొదలు పెట్టి, కలశ స్థాపన, పుణ్యావచనం,ప్రవర,జిలకర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర క్రతువులతో కార్యక్రమాన్ని జరిపారు. సర్వోపచార సేవలు నృత్యం, గీతం మరియు భజనలు, మంగళ వాయిద్యాలతో  వీరంతా భక్తులను అలరించారు. నాగేంద్రన్ మరియు వారు బృందం సన్నాయి డోలులతో అత్యంత శ్రావణీయంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అలంకృత ఎలమర్తి (సుప్రభాతం), షాలిని చెరకుల,మయూఖ, శ్రీముఖి లక్కవజ్జుల, కృతి కవికొండల, రంజిత హంసాల,అనిత సజ్జ, హాసిని,ఆశ్రిత సామంతుల, సీరం గొర్తి వివిద గీతములు పాడగా , మరియు ప్రియాంక కూచిపూడి నృత్యం సర్వోపచారములలో భాగంగా కల్యాణ మహోత్సవం లో పాల్గొని భక్తుల అభినందనలు పొందారు. టొరంటోలో జరిగిన ఈ కార్యక్రమానికి 57 మంది జంటలు కల్యాణానికి కూర్చొన్నారు. దాదాపు వంద మంది సంకల్పం తీసుకున్నారు. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమము చివరగా మంగళ హారతులు పాడి , తీర్థ ప్రసాదాలు భక్తులందరికి అంద చేసారు.

ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, డైరెక్టర్స్ అనిత సజ్జ, గణేష్ తెరాల,రాణి మద్దెల, యూత్ డైరెక్టర్స్ విద్య భావనం, ఖాజిల్ మరియు బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక మరియు ఇతర వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, అరుణ్ లయం ,లోకేష్ చిల్లకూరు,రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరు, రామ చంద్ర రావు దుగ్గిన మరియు అందరి వాలంటీర్లను తాకా అధ్యక్షులు కల్పన మోటూరి  అభినందించారు.

 

వీడియో ను కింది లింక్ లో చూడొచ్చు.. 

https://photos.app.goo.gl/uxn4SaWxTginVrw58

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version