November 2022 Movie Releases: అక్టోబర్ నెల ముగిసింది..ఈ అక్టోబర్ నెలలో దసరా మరియు దీపావళి కానుకగా చాలా సినిమా విడుదలయ్యాయి..వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్,కన్నడ డబ్బింగ్ చిత్రం కాంతారా, కార్తీ హీరో గా నటించిన సర్దార్ మరియు విశ్వక్ సేన్ హీరో గా నటించిన ఓరిదేవుడా చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి..కానీ నాగార్జున ఘోస్ట్, బెల్లంకొండ గణేష్ స్వాతి ముత్యం మరియు మంచు విష్ణు జిన్నా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచాయి..వీటితో పాటు జాతిరత్నాలు వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ దర్శకుడు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో చేసిన ‘ప్రిన్స్’ అనే చిత్రం కూడా తెలుగులో విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..అలా అక్టోబర్ నెల కొన్ని హిట్లు కొన్ని ఫ్లాప్స్ తో ముగిసిపోయింది..ఇక నవంబర్ నెలలో విడుదల అవ్వబోతున్న సినిమాల గురించి ఒక లుక్ వేద్దాం.

లైక్,షేర్ & subscribe :
యంగ్ హీరో శోభన్ మరియు ఫైర అబ్దుల్లా హీరో హీరోయిన్లు గా నటించిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించారు..ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది..యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ చిత్రం నవంబర్ 4 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఊర్వశివో రాక్షసీవో:
చాలా కాలం తర్వాత అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ హీరోగా మన ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ శిరీష్ కి జోడిగా నటిస్తుంది..ఈ చిత్రం కూడా నవంబర్ 4 వ తేదీన విడుదల కాబోతుంది..నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధి గా నందమూరి బాలకృష్ణ హాజరైన సంగతి మన అందరికి తెలిసిందే..అప్పటి నుండి ఈ చిత్రానికి మరింత హైప్ ఏర్పడింది..ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగానే ఉండడం తో అల్లు శిరీష్ కి హిట్ పడినట్టే అని అనుకుంటున్నారు ఆయన అభిమానులు..ఈ సినిమా ద్వారా రాకేష్ శశి అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు.
బొమ్మ బ్లాక్ బస్టర్ :
నందు మరియు ప్రముఖ టీవీ యాంకర్ రష్మీ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా కూడా నవంబర్ 4 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా ఆగిపోవాల్సి వచ్చింది..ఈమధ్యనే వినూతనమైన రీతిలో ప్రొమోషన్స్ ని ప్రారంభించి ఈ చిత్రానికి హైప్ తెచ్చే ప్రయత్నం చేసారు..రాజ్ విరాట్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అవ్వబోతున్నాడు.

బనారస్ :
జైద్ ఖాన్ మరియు సోనాల్ అనే నూతన నటీనటులు నటించిన ఈ చిత్రం కూడా నవంబర్ 4 వ తేదీన విడుదల అవుతుంది..జయాతీర్థ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం పై ట్రేడ్ ఎలాంటి బజ్ కూడా లేదు..కాబట్టి ఈ సినిమాకి థియేటర్స్ దక్కడం కష్టమే..ఒకవేళ థియేటర్స్ రావాలంటే కచ్చితంగా టాక్ రావాల్సిన పరిస్థితి ఉంది.
తగ్గేదే లే :
విలక్షణమైన పాత్రలతో సినిమాల్లో మరియు వెబ్ సిరీస్ లలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నవీన్ చంద్ర హీరో గా నటించిన ఈ సినిమా కూడా నవంబర్ 4 వ తేదీన విడుదల అవ్వబోతుంది..ఈ చిత్రం లో హీరోయిన్స్ గా దివ్య పిళ్ళై మరియు అనన్య సేన్ గుప్త నటిస్తున్నారు.
జట్టి :
ప్రముఖ హీరోయిన్ నందిత శ్వేతా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కూడా నవంబర్ 4 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మిల్లి :
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం మిల్లి కూడా నవంబర్ 4 వ తేదీన విడుదల కాబోతుంది..ముత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం లో AR రెహ్మాన్ సంగీత సారథ్యం లో తెరకెక్కిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి..చాలా కాలం నుండి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న జాన్వీ కపూర్ కి ఈ సినిమా ఎంతో కీలకం.
OTT చిత్రాలు :
ఈ ఏడాది దసరా కానుకగా విడుదలైన అక్కినేని నాగార్జున ఘోస్ట్, సెప్టెంబర్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన బ్రహ్మాస్త్ర చిత్రాలు కూడా నవంబర్ 4 వ తేదీన OTT లో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి..నాగార్జున ఘోస్ట్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతుండగా..బ్రహ్మాస్త్ర చిత్రం డిస్నీ + హాట్ స్టార్ లో విడుదల కానుంది..ఈ రెండు సినిమాల కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.