Mega Family vs Nandamuri Family 2025: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాయి. ఇక ఈ జనరేషన్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో కొంతమంది స్టార్ హీరోలుగా మారుతున్నారు. మరికొందరు మాత్రం చాలా వరకు డీలా పడిపోతున్నారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పెద్ది సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తుంటే ఎన్టీఆర్ సైతం వార్ 2(War 2) సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక దీంతోపాటుగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ (Dragon) సినిమా విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో తన ఇన్వాల్వ్ అయి దగ్గరుండి మరి అన్ని చూసుకుంటున్నారట…
ఇక వచ్చే సంవత్సరం మాత్రం పెద్ది, వార్2 సినిమాల మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉండబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇద్దరూ కలిసి చేసిన ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాలో నటించారు. అయితే పర్సనల్ జీవితంలో వీళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికి ప్రొఫెషనల్ కి వచ్చేసరికి మాత్రం వీళ్ళిద్దరూ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు.
కాబట్టి ఎవర్ని ఎవరు బీట్ చేసి టాప్ పొజిషన్ కి వెళ్తారు. తద్వారా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక వీళ్లిద్దరి మధ్య పోటీ ఇలా ఉంటే వచ్చే సంవత్సరం బాలయ్య బాబు (Balayya Babu) గోపీచంద్ మలినేని (Gopi Chand Malineni) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అలాగే చిరంజీవి సైతం అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేస్తున్న సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి వీళ్లిద్దరి మధ్య జరిగే పోటీలో ఎవరు విజయం సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే వచ్చే సంవత్సరం నందమూరి మెగా ఫ్యామిలీల మధ్య భారీ పోటీ అయితే జరగబోతుంది అనేది చాలా క్లియర్ గా తెలిసిపోతుంది…చూడాలి మరి ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారు అనేది…