7g Brindavan Colony Sequel: సిల్వర్ స్రీన్ పై కొన్ని ప్రేమకథలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. అందులో కచ్చితంగా చెప్పుకోదగిన సినిమా 7G బృందావన్ కాలనీ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించిన 7జీ రైయిన్ బో కాలనీ తమిళ్ లో సూపర్ హిట్ అయ్యింది. దానినే తెలుగు 7జీ బృందావన కాలనీ పేరుతో రీమేక్ చేయటం జరిగింది. 2004 లో విడుదలైన ఆ సినిమా అప్పటిలో యూత్ ని ఒక ఊపు ఊపింది . ఇప్పటికీ ఆ సినిమా సాంగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
అప్పటి స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి కొడుకు రవి కృష్ణ ను హీరోగా పరిచయం చేయటం జరిగింది. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగు సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత రవికృష్ణ అనేక సినిమాలు చేసిన కానీ హీరోగా నిలబడలేకపోయారు. ఇక ఈ సినిమా దర్శకుడు ఆ తర్వాత కొన్ని సినిమాలు తెరకెక్కించి నటుడిగా బిజీ గా ఉన్న సెల్వరాఘవన్ మళ్ళీ మెగా ఫోన్ పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.
సూపర్ హిట్ గా నిలిచిన 7జీ బృందావన కాలనీ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఆ సినిమాలో హీరోగా నటించిన రవి కృష్ణ ఈ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని సమాచారం. ఇప్పటికే కథ చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ సినిమా వచ్చిన 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు దానికి సీక్వెల్ రావడం విశేషం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండే అవకాశం ఉంది. అందుకోసం ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ ను అనుకున్నట్లు తెలుస్తుంది.
నటి అదితి శంకర్, ఇవనా లతో ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరిలో ఒకరిని ఈ సినిమాగా కోసం తీసుకునే అవకాశం ఉంది. అదితి శంకర్ నటించిన మారివన్ సినిమా తాజాగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక లవ్ టుడే సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఇవనా నటుడు హరీష్ కళ్యాణ్ తో నటించిన ఎల్ జీఎం సినిమా ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. త్వరలోనే హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 7జీ బృందావన కాలనీ సీక్వెల్ గురించి అధికారికంగా ప్రకటన రాబోతుంది.