71st National Film Awards 2025 Bhagavanth Kesari: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపందించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు…ఇక ఎక్కడ చూసిన తెలుగు సినిమాల డామినేషన్ కొనగుతుందనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు కేంద్రం నుంచి 71 వ జాతీయ చలనచిత్ర పురాషాకారాలను ప్రకటించారు. ఇక ఉత్తమ చిత్రం గా బాలయ్య బాబు నటించిన భగవంతు కేసరి సినిమాను ప్రకటించారు…నిజానికి ఈ సినిమా యావరేజ్ గా ఆడింది…అసలు ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ ఇచ్చేంత గొప్ప గా ఇందులో ఏముంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి…ఇంతకంటే మంచి సినిమాలు కూడా వచ్చాయి. వాటికి దక్కని అవార్డ్ ఈ మూవీకి ఎందుకు వచ్చింది…అసలు యాక్షన్ సన్నివేశాలతో నింపేసిన ఈ సినిమాను నేషనల్ అవార్డ్ కి ఎంపిక చేసినవారు ఎవరు అంటూ సోషల్ మీడియా లో పెద్ద రచ్చ అయితే నడుస్తోంది…దేశానికి సేవ చేసే సన్నివేశాలు లేవు…సమాజానికి ఉపయోగపడే సిద్ధాంతాలను చెప్పే సినిమా కాదు…
Also Read: బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు..నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సమయం
ఈ మధ్య నేషనల్ అవార్డ్స్ పేరు చెప్పి ఏ సినిమాకి పడితే ఆ సినిమాకి ఇచ్చేస్తున్నారు కాబట్టి వీటి మీద ప్రతి ఒక్కరికి గౌరవం కూడా తగ్గిపోతుంది…గత సంవత్సరం పుష్ప సినిమాలో నటించినందుకు గాను అల్లు అర్జున్ కి అవార్డ్ ఇచ్చారు…
అందులో పుష్ప రాజ్ క్యారెక్టర్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు…ఆయన సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వకపోగా జనాలను స్మగ్లింగ్ చేయమని చెప్పాడు…అలాంటి క్యారెక్టర్ కే నేషనల్ అవార్డ్ ఇవ్వగా పోయింది…ఇక బాలయ్య బాబు సినిమాకి అవార్డ్ ఇవ్వడం లో తప్పేముంది అని అనేవారు కూడా ఉన్నారు…
మొత్తానికైతే అవార్డ్స్ పేరు చెప్పి వల్ల ఇష్టం వచ్చిన సినిమాలకు అవార్డ్స్ ఇస్తూ వాటిని భ్రష్టు పట్టిస్తున్నారు అంటూ చాలా మంది జనాలు విమర్శిస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా స్టార్ హీరోల సినిమాలు ఎలా ఉన్న వాళ్లకు మాత్రమే ఈ అవార్డులు దక్కడం పట్ల మంచి కంటెంట్ తో సినిమాలు చేస్తున్న చిన్న నటులు దర్శకులు సైతం కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు…