Kingdom Collection: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie) నిన్న భారీ అంచనాల నడుమ విడుదలై ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ నుండి మంచి టాక్ వచ్చినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో షోస్ మొదలయ్యాక ఫ్లాప్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో, సెకండ్ హాఫ్ అంత దరిద్రం గా ఉందని, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) నుండి ఇలాంటి ప్రాజెక్ట్ ని అసలు ఆశించలేదంటూ చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. కానీ మొదటి నుండి ఈ సినిమాపై మంచి హైప్ ఉండడం తో ఓపెనింగ్ వసూళ్ల వరకు బాగానే వచ్చాయి అనొచ్చు. ట్రేడ్ పండితులు అందించిన లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 39 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
Also Read: బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు..నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సమయం!
విజయ్ దేవరకొండ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించిన చిత్రంగా నిల్చింది కానీ, మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఆల్ టైం రికార్డుని మాత్రం క్రియేట్ చేయలేకపోయింది. ఇక రెండవ రోజు వసూళ్ల విషయానికి వస్తే ఆంధ్ర ప్రదేశ్ లోని మెయిన్ సెంటర్స్ లో పర్వాలేదు అనే రేంజ్ హోల్డ్ ని సొంతం చేసుకుంది కానీ, మాస్ సెంటర్స్ లో మాత్రం సినిమా తుడిచిపెట్టుకొని పోయింది. అనకాపల్లి లాంటి సెంటర్ లో మ్యాట్నీ షో వసూళ్లు 50 వేల రూపాయలకు పడిపోయిందంటే సినిమా ఫ్లాప్ అయ్యిందని అర్థం. తెలంగాణ లో కూడా ఇదే పరిస్థితి. ఒక్క హైదరాబాద్ లో మాత్రం రెండవ రోజు ఫస్ట్ షోస్ నుండి మంచి ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంది కానీ, తెలంగాణ జిల్లాల్లో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. గురువారం రిలీజ్ కాకుండా శుక్రవారం రోజున ఈ చిత్రాన్ని విడుదల చేసుంటే ఈ రేంజ్ డ్రాప్స్ ఉండేవి కావని అంటున్నారు విశ్లేషకులు.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే రెండవ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. రెండు రోజులకు కలిపి 15 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, లాంగ్ వీకెండ్ పూర్తి అయ్యేలోపు ఈ చిత్రం రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ మార్కుని అవలీలగా దాటుతుందని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతానికి మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైం రికార్డు న్యాచురల్ స్టార్ నాని పేరు మీదనే ఉంది. ఆయన హీరో గా నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ‘కింగ్డమ్’ సోమవారం రోజున కాస్త డీసెంట్ స్థాయి హోల్డ్ ని సొంతం చేసుకోగలిగితే కచ్చితంగా మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.