Homeఎంటర్టైన్మెంట్Pushpa- Russia: రష్యాలో తగ్గేదెలే: పుష్ప ప్రచారానికి ఏకంగా ఐదు కోట్లు

Pushpa- Russia: రష్యాలో తగ్గేదెలే: పుష్ప ప్రచారానికి ఏకంగా ఐదు కోట్లు

Pushpa- Russia: ఈ ముహూర్తాన పుష్ప ది రైజ్ సినిమా విడుదలైందో కానీ.. అల్లు అర్జున్ ను ఎక్కడికో తీసుకెళ్ళింది. స్టైలిష్ స్టార్ ను కాస్త యూత్ ఐకాన్ చేసింది. పాన్ ఇండియా స్టార్ గా అవతరించేలా చేసింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం ఇండస్ట్రీల్లో రికార్డుల దుమ్ము దులిపిన పుష్ప… ఈరోజు రష్యాలో విడుదల కాబోతోంది.. ఇందుకు సంబంధించి ప్రచారం చేసేందుకు మూవీ టీం కొద్ది రోజుల క్రితమే రష్యా వెళ్ళింది. అక్కడ భారతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ప్రచారం చేపట్టింది. అక్కడి మీడియా కూడా పుష్ప టీంను ఇంటర్వ్యూ చేసేందుకు ఉత్సాహం చూపింది. దీంతో మొత్తానికి పాన్ ఇండియా స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా అల్లు అర్జున్ ఎదిగాడు.

Pushpa- Russia
Pushpa- Russia

వేల స్క్రీన్లు

ఇండియాలో విడుదలై ఈ ఏడాది కావస్తున్నప్పటికీ పుష్పకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. దీంతో ఈ చిత్ర నిర్మాతలు రష్యాలో కూడా సినిమాను ఈరోజు విడుదల చేస్తున్నారు. అది కూడా వేలాది స్క్రీన్ లలో.. యుద్ధంతో సతమతమవుతున్న రష్యాలో ఒక భారతీయ సినిమా అందులోనూ ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో విడుదలవుతున్నదంటే మామూలు విషయం కాదు. ఇండియాలో నెగిటివ్ టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈ చిత్రం.. రష్యా లోనూ ఇదే ఫలితం పునరావృతం చేస్తుందని సినిమా టీం నమ్ముతోంది. పైగా రష్యాలో స్థిరపడిన తెలుగువారు పుష్ప బృందానికి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు.. దీంతో ఈ విషయాన్ని అక్కడ మీడియా ప్రముఖంగా ప్రచురిస్తోంది. దీనివల్ల ఈ సినిమాకు ఎక్కడా లేని బజ్ ఏర్పడిందని అక్కడి పంపిణీదారులు అంటున్నారు. పుష్ప పార్ట్ 1 కనుక అక్కడ హిట్ అయితే రెండో భాగాన్ని ఇండియాతో పాటు రష్యాలోనూ నేరుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రెండో భాగానికి సంబంధించి ఎక్కువ భాగం అడవుల్లో చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది కాబట్టి.. మొదట రష్యా ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సినిమా టీం థాయ్ లాండ్ ను ఎంచుకున్నది.

ఐదు కోట్లు

అయితే ఈ సినిమాను రష్యాలో ఎప్పుడైతే విడుదల చేయాలి అనుకున్నారో… సినిమా బృందం వెంటనే అక్కడికి వాలిపోయింది. వినూత్నంగా ప్రచారం చేయడం ప్రారంభించింది.. అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్… ఇతర నటీనటులు నేరుగా మాస్కో వెళ్లారు. అక్కడి తెలుగువారు వీరిని రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత స్థానిక మీడియాతో ఇంటర్ యాక్ట్ అయ్యారు. సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా దీనికోసం సినిమా టీం ఐదు కోట్ల దాకా ఖర్చుపెట్టినట్టు సమాచారం. మొన్న జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ ను విడుదల చేసినప్పుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కుటుంబాలతో సహా అక్కడికి వెళ్లారు. అక్కడ విరివిగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఇందుకుగాను మూడు కోట్ల దాకా ఖర్చైనట్టు సమాచారం. పుష్ప ఈ విషయంలో రెండు కోట్లు ఎక్కువగానే ఖర్చు పెట్టింది.

Pushpa- Russia
Pushpa- Russia

మార్కెట్ పెంచుకునేందుకు..

ఇండియాలో సినిమా విడుదలైన తర్వాత ఇతర దేశాల్లో రిలీజ్ చేయడం వెనుక అసలు కారణం మార్కెట్ పెంచుకోవడమే. గతంలో బాలీవుడ్ నటీనటులు ఇదే విధంగా చేసేవారు. ఫలితంగా వారి మార్కెట్ పెరిగింది. ఇప్పుడు అదే దారిని తెలుగు నటీనటులు అనుసరిస్తున్నారు. అందులో భాగంగానే విదేశాల్లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. వీటివల్ల భవిష్యత్తులో మార్కెట్ పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు.. పైగా ఆదేశాల కరెన్సీ మన దేశం కంటే ఎక్కువ ఉండడంతో వసూలు కూడా మెరుగ్గా ఉంటాయని విశ్వసిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular