https://oktelugu.com/

Anushka Sharma: అనుష్క ప్రొడక్షన్‌ హౌస్ తో 400 కోట్ల డీల్‌

Anushka Sharma: కరోనా వేగంగవంతం కావడంతో సినిమా రంగానికి ప్రస్తుతం కనిపిస్తున్న ఏకైక ఆశా కిరణం ఓటీటీ. గత రెండేళ్ల నుంచి కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. పైగా నచ్చిన కంటెంట్ కోసం రూ.వందల కోట్లు వెచ్చించడానికి ఓటీటీలు సిద్ధపడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ నిర్మాణ సంస్థ CLEAN SLATE FILMZతో అమెజాన్ ప్రైమ్, నెట్‌ ఫ్లిక్స్‌లు ఏకంగా రూ. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 28, 2022 / 11:14 AM IST
    Follow us on

    Anushka Sharma: కరోనా వేగంగవంతం కావడంతో సినిమా రంగానికి ప్రస్తుతం కనిపిస్తున్న ఏకైక ఆశా కిరణం ఓటీటీ. గత రెండేళ్ల నుంచి కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. పైగా నచ్చిన కంటెంట్ కోసం రూ.వందల కోట్లు వెచ్చించడానికి ఓటీటీలు సిద్ధపడుతున్నాయి.

    Anushka Sharma-Virat Kohli

    తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ నిర్మాణ సంస్థ CLEAN SLATE FILMZతో అమెజాన్ ప్రైమ్, నెట్‌ ఫ్లిక్స్‌లు ఏకంగా రూ. 400 కోట్లతో ఒప్పందం చేసుకున్నాయి. రాబోయే 18 నెలల్లో ఆ నిర్మాణ సంస్థ నిర్మించే సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఈ రెండు ఓటీటీలు రిలీజ్ చేయనున్నాయి.

    Also Read:  వాట్సాప్ సరికొత్త ఫీచర్.. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పేలతో పోటీ..

    ఇక అనుష్క ప్రొడక్షన్‌ హౌజ్‌తో రూ. 400 కోట్ల డీల్‌ అనగానే బాలీవుడ్ కూడా షాక్ అయింది. ఏది ఏమైనా నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో అప్ డేట్ అవుతూ వస్తుంది ఓటీటీ సంస్థలు మాత్రమే. సినిమాలు ఓల్డ్ కంటెంట్ తో బోర్ కొట్టిస్తుంటే.. ఓటీటీలు మాత్రం ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆకట్టుకుంటున్నాయి.

    Anushka Sharma

    దీనికి తోడు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ సినీ ప్రముఖులతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుంటూ బాగానే ముందుకు పోతున్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ కొత్త కంటెంట్ తో వస్తోంది. పైగా ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లకు మంచి డిమాండ్ ఉంది.

    Also Read:  దాని కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు.. ఎమోషనలైన మహేష్‌ బాబు వైఫ్ !

    Tags