spot_img
Homeఎంటర్టైన్మెంట్మ‌హేష్ స్టోరీ.. ప‌వ‌న్ కు ఇచ్చేస్తున్నాడ‌టగా?

మ‌హేష్ స్టోరీ.. ప‌వ‌న్ కు ఇచ్చేస్తున్నాడ‌టగా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లోకి రాక‌ముందు ఆయ‌న‌ సినిమా రావాలంటే.. మినిమం ఏడాది కాలం వెయిట్ చేయాల్సిందే. ఏడాదిపైన ఎంత స‌మ‌యం ప‌డుతున్న‌ది లెక్కేసుకోవాల్సిన ప‌రిస్థితి ఉండేది. కానీ.. రీ-ఎంట్రీతో మొత్తం మారిపోయింది. ఒకేసారి నాలుగు సినిమాల‌ను లైన్లో పెట్టిన ప‌వ‌ర్ స్టార్‌.. అంద‌రితో వామ్మో అనిపించారు. ఇప్పుడు లేటెస్ట్ బ‌జ్ ప్ర‌కారం లైన్లోకి మ‌రొక‌టి వ‌చ్చి చేరింది.

రీ-ఎంట్రీ మొదటి మూవీ వ‌కీల్ సాబ్ తో త‌న స్టామినా ఏంటో చాటిచెప్పాడు ప‌వ‌న్‌. ఈ మూవీ అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డంతో ఫ్యాన్స్ ఆనందాన్ని హ‌ద్దుల్లేకుండా పోయాయి. ఆ త‌ర్వాత అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్‌, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రాలు రానున్నాయి. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ రెండు చిత్రాల‌ను కంప్లీట్ చేయాల‌ని భావించిన ప‌వ‌న్‌.. ఉద‌యం ఓ షూట్లో.. మ‌ధ్యాహ్నం మ‌రో సెట్లో పాల్గొన్నారు. ఈ త‌రుణంలో సెకండ్ వేవ్ త‌రుముకొచ్చి షూటింగులు ఆపేసింది.

రీ-ఓపెన్ త‌ర్వాత మ‌ళ్లీ ఇదే ప‌ద్ధ‌తిలో రెండు సినిమాల‌ను ఏక‌కాలంలో కంప్లీట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల త‌ర్వాత గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ సినిమా మొద‌లు కానుంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా సూప‌ర్ డూపర్ స్క్రిప్టుతో తెర‌కెక్క‌బోతోంద‌ని, అభిమానుల అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉంటుంద‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీశ్రీప్ర‌సాద్ చెప్ప‌డంతో సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది.

ఈ చిత్రం త‌ర్వాత డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ట ప‌వ‌న్‌. పూరీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యిందే ప‌వ‌న్ సినిమాతో. వీరిద్ద‌రూ క‌ల‌యిక‌లో వ‌చ్చిన ‘బ‌ద్రి’ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ త‌ర్వాత కెమెరామెన్ గంగ‌తో రాంబాబు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. స‌రిగా ఆడ‌లేదు. ఇప్పుడు మూడో సినిమా రాబోతోంద‌ని టాక్‌. ఓ బ‌డా ప్రొడ్యూసర్ ఈ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప‌వ‌న్ ఓకే చెప్ప‌డ‌మే మిగిలి ఉంద‌ని అంటున్నారు.

అది కూడా మ‌హేష్ కోసం రాసిన క‌థ‌తో ఈ సినిమా తీయ‌బోతున్నాడ‌ని అంటున్నారు. అప్పుడెప్పుడో ‘జనగణమన’ స్క్రిప్టు రాసుకున్నాడు పూరీ. మహేష్ తో చేయాలనుకున్నా.. కుదరలేదు. ఇప్పుడు దాన్ని పవన్ కు ఇచ్చేస్తున్నాడని అంటున్నారు. మరి, ఇందులో వాస్తవం ఎంత అన్నది చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper
Exit mobile version