
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రయోజనం చేకూర్చడం కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్ లలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కింద రైతులకు ఏకంగా 6,000 రూపాయలు అందిస్తోంది. మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో ఈ నగదు జమవుతోంది.
మోదీ సర్కార్ ఇటీవల ఈ స్కీమ్ కు సంబంధించి 8వ విడత నగదును జమ చేయగా రైతుల ఖాతాలలో ఆ నగదు జమైంది. అయితే కొందరు రైతులు మాత్రం తమకు అర్హత ఉన్నా నగదు ఖాతాలో జమ కాలేదని చెబుతుండటం గమనార్హం. అర్హత ఉండి ఖాతాలో నగదు జమ కాని వారు ఏ మాత్రం చింతించాల్సిన అవసరం లేదు. ఫిర్యాదు చేయడం ద్వారా నగదు జమయ్యే విధంగా రైతులు చర్యలు తీసుకోవచ్చు.
011 24300606 నంబర్ కు కాల్ చేయడం ద్వారా పీఎం కిసాన్ స్కీమ్ నగదు జమ కాని వాళ్లు సులభంగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. 18001155266, 155261, 011 23381092, 011 23382401 నంబర్లకు కాల్ చేయడం ద్వారా కూడా పీఎం కిసాన్ స్కీమ్ కు సంబంధించి సులభంగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. స్థానికంగా ఉండే వ్యవసాయ అధికారులను సంప్రదించి కూడా ఫిర్యాదు చేయవచ్చు.
pmkisan-ict@gov.in ఈమెయిల్ ద్వారా డబ్బు అందకపోతే ఫిర్యాదు చేయవచ్చు. ఎందుకు డబ్బు జమ కాలేదో సరైన కారణాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ స్కీమ్ లో చేరకపోయి ఉంటే ఆన్ లైన్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.