Mahesh Babu
Mahesh Babu : హైదరాబాద్ లో విపరీతమైన క్రేజ్ ని దక్కించుకున్న మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఒకటి సూపర్ స్టార్ మహేష్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా కలిసి నిర్మించిన AMB సినిమాస్. నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ని కూడా ఈ మల్టీప్లెక్స్ హైదరాబాద్ లో డామినేట్ చేస్తుంది అంటే సాధారణమైన విషయం కాదు. ఎంత పెద్ద ఫ్లాప్ సినిమా అయినా, ఈ థియేటర్ లో కనీస స్థాయి వసూళ్లను రాబడుతుంది. అంతటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న థియేటర్ ఇది. థియేటర్ ని మైంటైన్ చేసే విషయం లో కూడా యాజమాన్యం ఎంతో శ్రద్ద తీసుకుంటుంది. థియేటర్ లోపలకు అడుగుపెట్టిన ప్రేక్షకులు బయట ప్రపంచాన్ని మర్చిపోయి, ఒక సరికొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టిన అనుభూతిని ఇస్తుంది ఈ మల్టీ ప్లెక్స్. అంతే కాదు, థియేటర్ లో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఎన్నో సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకున్నారు. అలాంటి థియేటర్ లో ఫైర్ ఎమర్జెన్సీ అలారం మోగడం, భయంతో జనాలు థియేటర్ నుండి పరుగులు పెట్టడం ఇప్పుడు సంచలనం గా మారింది.
థియేటర్ లో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పుడు జనాలను హెచ్చరిస్తూ ఈ అలారం మోగుతుంది. అంతటి విపత్తు ఏర్పడడానికి కారణం బాలయ్య, తమన్ అని చెప్పొచ్చు. అవును మీరు వింటున్నది నిజమే, AMB థియేటర్ లో ‘డాకు మహారాజ్’ మూవీ థియేటర్ ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలో ఒక సన్నివేశం వద్ద థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి థియేటర్ లో ఉండే DTS బాక్సులు కాలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫైర్ ఎమర్జెన్సీ అలారం మోగడం తో జనాలు భయపడి థియేటర్ నుండి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. ఇలాంటి ప్రమాదాలు వీళ్ళ కాంబినేషన్ కి కొత్తేమి కాదు. అఖండ, వీర సింహా రెడ్డి చిత్రాలకు కూడా గతం లో ఇలాంటి సంఘటనలు జరిగాయి.
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘స్కంద’ చిత్రానికి కూడా కొన్ని చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి, ఆ చిత్రానికి కూడా సంగీత దర్శకుడు తమనే. థియేటర్స్ యాజమాన్యం తమన్ సంగీతం అందించే సినిమాలను ప్రదర్శించడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. దయచేసి సౌండ్ ని స్టెబిలైజ్ చేసి పంపాలని, ఇలా అయితే మా థియేటర్స్ లో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నారట. AMB సినిమాస్ లో హై క్వాలిటీ DTS బాక్సులు ఉంటాయి, విదేశాల నుండి వీటిని తెప్పించారు, ఎంతటి సౌండ్ ని అయినా తట్టుకునే కెపాసిటీ ఈ DTS బాక్సులకు ఉంటాయి. అలాంటి బాక్సులే తట్టుకోలేకపోయాయంటే, ఇక సాధారణమైన థియేటర్స్ తట్టుకోగలుతాయా చెప్పండి. బెస్ట్ థియేట్రికల్ అనుభూతి కోసం సౌండ్ ని 7 లో పెడితే DTS బాక్సులు బద్దలయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
In AMB cinemas the fire emergency alarm sounded..
People ran Out @MusicThaman anna Enti idhi @dirbobby garu idhi chusaraBalayya – Thaman combo #DaakuMaharaaj #BlockBusterDaakuMaharaaj pic.twitter.com/eCHLDSGWn5
— Rebal Relangi (@RebalRelang) January 28, 2025