Homeఎంటర్టైన్మెంట్25.08.2021 : నేటి సినిమా ఎక్స్ క్లూజివ్ కబుర్లు

25.08.2021 : నేటి సినిమా ఎక్స్ క్లూజివ్ కబుర్లు

Tollywood Movie Updates

  • బస్ ఫుట్‌ బోర్డ్ పై మంత‌, న‌య‌న‌తార‌.
  • ‘భారతీయుడు 2’ పై కమల్ మనసులో మాట,
  • రేపటి నుండి ప్రభాస్ – కృతిసనన్ ల పై సాంగ్ షూట్,
  • నివేదా పేతురాజ్ తనలాగే చేయమంటుంది.

Today Exclusive Telugu Movie Updates:
Nayanthara Samantha
స‌మంత‌ (Samantha), న‌య‌న‌తార‌ (Nayanthara) బస్ ఫుట్‌ బోర్డ్ పై నిల్చొని ప్ర‌యాణిస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. సామ్, నయన్ ప‌క్క‌నే విజ‌య్ సేతుప‌తి కూడా ఉన్నాడు. అయితే ‘కాతువాకుల రెండు కాదల్’ షూటింగ్ లో భాగంగా ఈ ముగ్గురు ఇలా ప్రయాణించాల్సి వచ్చింది. అయితే స‌మంత‌, న‌య‌న‌తార‌ ఇద్ద‌రూ తెల్ల చీర‌లు ధ‌రించి కనబడ్డారు. వారి వెనుక ఉన్న విజ‌య్ సేతుప‌తి వారికి టచ్ కాకుండా ఉండటానికి వెనక్కి బలంగా వాలుతూ కనిపించాడు. కాకపోతే ఈ వీడియో కొంచెం అస్పష్టంగా ఉంది.
Bharateeyudu-2 latest updates
ఇక ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) విషయంలో దర్శకుడు శంకర్ చిత్ర నిర్మాతకు మధ్య ముదిరిన వివాదం, హైకోర్టు వరకు వెళ్లిన వ్యవహారం పై కమల్ హాసన్ మొదటిసారి స్పందించారు. దర్శక, నిర్మాతల మధ్య సమస్యను పరిష్కారిస్తున్నాము అని, త్వరలోనే సమస్య సమసిపోతుందని కమల్ చెప్పుకొచ్చారు. అలాగే ‘ఇండియన్ 2’ సినిమాని పూర్తి చేస్తామని కూడా కమల్ స్పష్టం చేశారు.
Adipurush latest updates
నేషనల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్స్ ను గత కొన్ని రోజులుగా ముంబైలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రేపటి నుండి ప్రభాస్ – కృతిసనన్ ల పై ఓ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. ఈ సాంగ్ కోసం తోట తరుణీ ప్రత్యేక సెట్ వేశారు.
Nivetha Pethuraj
అన్నట్టు హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) ప్యూర్ వెజిటేరియన్ గా మారింది. వెజిటేరియన్ గా మారిపోయాక ఆమె ఎంతో మారిపోయిందట. షుగర్ వాడకాన్ని కూడా తగ్గించి, ఆర్గానిక్ తేనెను వాడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ తనలాగే చేయమంటుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version