Allu Aravind Geetha Arts: నిర్మాతగా అల్లు అరవింద్(Allu Aravind) కి ఈ ఏడాది గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. ఆయన పట్టిందల్లా బంగారం లాగా మారిపోతోంది. గతం లో గీత ఆర్ట్స్ నుండి వచ్చే సినిమాలు కనీసం ఒకటి రెండు అయినా ఫ్లాప్ అయ్యేవి. కానీ ఈ ఏడాది 100 శాతం స్ట్రైక్ రేట్ తో ప్రభంజనం సృష్టించింది ‘గీతా ఆర్ట్స్'(Geetha Arts) సంస్థ. ఈ ఏడాది ప్రారంభం లో ఈ సంస్థ నుండి వచ్చిన మొట్టమొదటి చిత్రం ‘తండేల్’. నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరెకెక్కిన ఈ సినిమా మ్యూజికల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో, సినిమా పరంగా కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ‘చావా’ చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలు చేసి గ్రాండ్ గా మన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. ఇది కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది.
ఇక ఆ తర్వాత ఈ సంస్థ నుండి విడుదలైన ‘సింగిల్’ చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. శ్రీవిష్ణు హీరో గా నటించిన ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఈ సంస్థ నుండి విడుదలైన చిత్రం ‘కాంతారా 2’. ఆంధ్ర ప్రదేశ్ థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేయగా, లాభాలు రాకపోయినా, నష్టాలు మాత్రం రాలేదని తెలుస్తోంది. ఈ చిత్రానికి ముందు జులై నెలలో ‘మహావతార్ నరసింహా’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని కొనొగోలు చేసిన అల్లు అరవింద్, మరోసారి జాక్ పాట్ కొట్టేసాడు. ఇక ఆ తర్వాత ‘లిటిల్ హార్ట్స్’ చిత్రాన్ని కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా తమ బ్యానర్ ద్వారా రిలీజ్ చేసి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక రీసెంట్ గా రష్మిక మందాన ప్రధాన పాత్ర పోషించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం విడుదలై ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా కూడా గీతా ఆర్ట్స్ నుండి వచ్చినదే. ఇలా ఒక్క ఏడాది లో ఇన్ని విజయవంతమైన సినిమాలను తీయడం మామూలు విషయం కాదు. అల్లు అర్జున్ తో పాటు, అల్లు ఫ్యామిలీ మొత్తానికి ప్రస్తుతం మహర్దశ నడుస్తోంది. పెట్ట్టిందల్లా బంగారం లాగా మారిపోతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ హీరో గా ‘ఆకాశం లో ఒక తార’ అనే చిత్రం తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.