Year Roundup 2023: 2023 వ సంవత్సరంలో చిన్న సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఇక మునుపెన్నడూ లేని విధంగా చిన్న సినిమాలు ఈ సంవత్సరం వాటి హవాని చాలా వరకు చూపిస్తూ వచ్చాయి. అందులో భాగంగానే జనవరి నెలలో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన కళ్యాణం కమనీయం సినిమా పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు. అలాగే సుధీర్ బాబు హీరో గా వచ్చిన హంట్ సినిమా కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించ లేకపోయింది… ఇక చిన్న చిన్న షార్ట్ ఫిలిం ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంటరై కలర్ ఫోటో సినిమాతో హీరో గా మారి తనకంటూ ఒక మంచి మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్న సుహాస్ కూడా ఈ సంవత్సరం రైటర్ పద్మ భూషణ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇక దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన ఈ సినిమా కొంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేసింది… అలాగే బుట్ట బొమ్మ, వినరో భాగ్యము, శ్రీదేవి శోభన్ బాబు లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాయి… ఇక ఆ తర్వాత వేణు దర్శకుడిగా పరిచయమై తెరకెక్కించిన బలగం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా చిన్న సినిమాల్లో పెద్ద హిట్టుగా నిలిచింది. ఇక దాంతో ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది…
ఇక ఈ సినిమాల తర్వాత శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన సామజవరగమన సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అందులోని కామెడీకి ప్రతి ప్రేక్షకుడు కూడా మంత్ర ముగ్ధుడు అయిపోయాడు. ఇక ఇలాంటి సినిమా ఈ 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు రాలేదు అంటూ ప్రేక్షకులు కూడా సినిమా పైన ప్రశంసల వర్షం కురిపించారు.ఇక ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ తమ్ముడు అయిన ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా ఈ సంవత్సరం సూపర్ డూపర్ హెట్టైనా చిన్న సినిమాల్లో టాప్ వన్ లో నిలిచిపోయింది… ఈ సినిమా 10 కోట్లతో తెరకెక్కితే దాదాపు 80 కోట్ల వరకు కలక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఇక ఈ సినిమాలో ఉన్న ప్రతి సీన్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. అందుకే ఈ సినిమాని సూపర్ డూపర్ సక్సెస్ చేశారు…
అలాగే తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన కీడా కోలా సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఈ సినిమా క్రైమ్ కామెడీగా తరికెక్కిన విషయం తెలిసిందే ఈ సినిమా కొంత వరకు ప్రేక్షకులను మెప్పించింది… ఇక ఈ సినిమా తర్వాత భారీ అంచనాలతో వచ్చిన పొలిమేర 2 సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఈ సినిమాలో ఉన్న ట్వీస్ట్ లకు ప్రతి ప్రేక్షకుడు కూడా మంత్ర ముగ్ధుడయ్యడనే చెప్పాలి… ఇక శ్రీకాంత్ కోటబొమ్మాలి పిఎస్ సినిమా కూడా ఈ సంవత్సరం చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన సినిమాగా నిలిచింది…