హాలీవుడ్లో సినిమా ప్రారంభం రోజునే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు.. బాలీవుడ్లో కూడా దాదాపు ఇలాగే చేస్తారు.. ఇప్పుడు టాలీవుడ్లో కూడా ఈ సాంప్రదాయం మొదలైందా? అంటే.. అవుననే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాల విడుదల తేదీలను ఇప్పుడే ప్రకటించేశారు. ఇంకా రాబోతున్నాయి. వచ్చే ఏడాది ఐదారు పెద్ద సినిమాలు ఏ సమయంలో సందడి చేయబోతున్నాయో.. ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఆ వివరాలు చూద్దామా…?
Also Read: ఐటం సాంగ్ పై నిలదీసిన నెటిజన్ కు అనసూయ ఇచ్చిన సమాధానమిదీ
సర్కారు వారి పాటః సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు పరశురామ్ కాంబోలో రాబోతున్న మూవీ ‘సర్కారు వారి పాట’. టైటిల్ తోనే హై క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాన్నారు. బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలు కాజేసే ఆర్థిక నేరగాళ్ల పనిపట్టే కథతో వస్తోందీ మూవీ. తన తండ్రిపై మోపిన నిందను తుడిచేసి, నిజమైన నేరగాళ్లను పట్టించే కొడుకు పాత్రలో నటించబోతున్నాడట మహేష్. ఈ సినిమాను 2022 సంక్రాంతి బరిలో నిలపబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ తోపాటు, మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
హరి హర వీరమల్లుః పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ – దర్శకుడు క్రిష్ కాంబోలో రాబోతున్న హిస్టారికల్ మూవీ హై రేంజ్ క్యూరియాసిటీ ఫిల్ చేస్తోంది. ఈ మూవీకోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. 15 శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్య పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ డ్రామాలో.. పవన్ వజ్రాల దొంగగా కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఈ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. అందుకే.. ఈ రెండు భారీ చిత్రాలు పొంగల్ ను సెలక్ట్ చేసుకున్నాయి.
సలార్ః ఇక, వచ్చే ఏడాది రాబోతున్న మరో భారీ చిత్రం ప్రభాస్ సలార్. ఈ మూవీని ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నటు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ.. అనౌన్స్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ భారీ యాక్షన్ మూవీ రిలీజ్ డేట్ ను కూడా ఇంత త్వరగా ప్రకటించడం విశేషమే. అయితే.. ఈ డేట్ ను ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అర్థమవుతోంది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉంది. 15వ తేదీన గుడ్ ఫ్రైడే. 16 శనివారం, 17 ఆదివారం అంటే నాలుగు రోజుల సెలవులు కలిసి వస్తున్నాయన్నమాట. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఈ నాలుగు రోజుల్లో బాక్సాఫీస్ ను దున్నేయడం ఖాయమని మేకర్స్ డిసైడ్ అయిపోయి ఈ డేట్ ఫిక్స్ చేశారు.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ః ఇంకా ప్రారంభం కాకుండానే ఆసక్తిని రేపుతున్న చిత్రం ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా. ఈ మూవీకి సైతం అప్పుడే రిలీజ్ డేట్ ను పరిశీలిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడట దర్శకుడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ షూట్ పూర్తయిన తర్వాత జూనియర్ ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోలో పాల్గొంటాడు. ఈ షోను జెమిని ఛానల్ ప్రసారం చేయనుంది. ఈ షో పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టనున్నాడు.
Also Read: విరాటపర్వం అంతర్జాతీయ ఓటీటీకి.. భారీ రేటుకు.. ఎంతంటే?
బన్నీ – కొరటాలః ఇక, అనౌన్స్ కాకుండానే రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తున్న మరో సినిమా బన్నీ-కొరటాల సినిమా. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఆచార్య మూవీ తర్వాత ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాడు కొరటాల. వీరిద్దరి సినిమాను వచ్చే ఏడాది మార్చి 31కి అటు ఇటుగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
లూసిఫర్ రీమేక్ః మెగాస్టార్ ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత లూసీఫర్ రీమేక్ ను పట్టాలెక్కించనున్నాడు. రీమేక్ స్పెషలిస్ట్ మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే కొబ్బరి కాయ కొట్టిన ఈ మూవీ రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే.. ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ప్రభాస్ సలార్ రిలీజ్ కు కాస్త ముందుగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారని టాక్.
మొత్తానికి 2022లో విడుదల కాబోతున్న సినిమాల డేట్లు.. ఏడాదికి ముందే ప్రకటించడం విశేషం. దీనివల్ల పోటీని నివారించడంతోపాటు.. ఆడియన్స్ లో సినిమా ప్రచారంలో ఉంటుంది. ఇక, ఈ పంథా భవిష్యత్ లోనూ కంటిన్యూ అవుతుందని అనిపిస్తోంది. ఏదేమైనా.. మార్పు మంచికే.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్