https://oktelugu.com/

నెలకు రూ.6వేలు చెల్లిస్తే కొత్తకారు మీ సొంతం.. ఎలా అంటే..?

ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటైన మారుతి సుజుకీ కొత్తకారు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తక్కువ ఈఎంఐ చెల్లించి కొత్త కారును కొనుగోలు చేసే అవకాశాన్ని ఈ సంస్థ కల్పిస్తోంది. మారుతీ సెలెరియో ఎక్స్ కారును కొనుగోలు చేస్తే నెలకు 6,000 రూపాయల ఈ.ఎం.ఐ చెల్లించడం ద్వారా కొత్త కారును సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ కారును కొనుగోలు చేసే వాళ్లు లక్ష రూపాయల వరకు డౌన్ పేమెంట్ ను చెల్లించాల్సి ఉంటుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 3, 2021 / 09:58 AM IST
    Follow us on

    ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటైన మారుతి సుజుకీ కొత్తకారు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తక్కువ ఈఎంఐ చెల్లించి కొత్త కారును కొనుగోలు చేసే అవకాశాన్ని ఈ సంస్థ కల్పిస్తోంది. మారుతీ సెలెరియో ఎక్స్ కారును కొనుగోలు చేస్తే నెలకు 6,000 రూపాయల ఈ.ఎం.ఐ చెల్లించడం ద్వారా కొత్త కారును సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ కారును కొనుగోలు చేసే వాళ్లు లక్ష రూపాయల వరకు డౌన్ పేమెంట్ ను చెల్లించాల్సి ఉంటుంది.

    Also Read: సిమ్ కార్డులతో బ్యాంక్ ఖాతా ఖాళీ.. మోసగాళ్లు ఏం చేస్తున్నారంటే..?

    మారుతీ సెలెరియో ఎక్స్ కారు ధర 5,40,000 రూపాయలు కాగా లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే 4.4 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. కారు లోన్ తీసుకోవాలనుకుంటే వేర్వేరు బ్యాంకులు లోన్లు ఆఫర్ చేస్తున్నా తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ను ఎంపిక చేసుకుంటే మంచిది. ఉదాహరణకు 7.3 శాతం వడ్డీరేటుతో బ్యాంక్ లోన్ ను తీసుకుంటే నెలకు 6,500 రూపాయల చొప్పున 7 సంవత్సరాల పాటు ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది.

    Also Read: యాపిల్ ఫోన్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన మహిళ.. పార్సిల్ చూసి షాక్..?

    ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్లు ఎక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించడం ద్వారా తక్కువ కాలపరిమితితో కార్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల లోన్ ఈఎంఐ పెరిగినా వడ్డీ భారాన్ని మాత్రం సులభంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ కారు లీటర్ పెట్రోల్ కు 21.63 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుంది. ఈ కారులో ఆంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, వీల్ కవర్స్, పాసింజర్ ఎయిర్ బ్యాగ్, ఇతర ఫీచర్లు ఉన్నాయి.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    సమీపంలోని మారుతీ సుజుకీ షోరూంను సంప్రదించి ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కొత్త కారును కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు ఈ కారు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.