https://oktelugu.com/

Brazil: కూతురుతో పెళ్లి.. అత్తకు ప్రమోషన్‌.. ఈ మేయర్‌ నిర్వాకం..!!

సాధారణంగా పెళ్లయిన కొత్తలో అల్లుడు అత్తవారింటిపై కృతజ్ఞతతో ఉంటారు. అత్తవారింట్లో అల్లుడికి కూడా రాచమర్యాదలు లభిస్తాయి.

Written By: Raj Shekar, Updated On : May 2, 2023 6:16 pm
Follow us on

Brazil: ప్రేమ గుడ్డిది అంటారు.. పెద్దలు. ప్రేమకు వయసుతో కూడా తేడా లేదంటారు. కానీ ఇక్కడో పెద్దమనిషి ప్రేమకే కాదు, పెళ్లికి కూడా వయసుతో సంబంధం లేదని నిరూపించాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆరు పదుల వయసు దాటిన ఆయన తాజాగా, పదహారేళ్ల పడుచు పిల్లను పెళ్లాడాడు. అంతేకాదు.. తనకు పిల్లను ఇచ్చిన అత్తకు కృతజ్ఞతగా ఏకంగా ప్రభుత్వ శాఖలో పదోన్నతి కూడా కల్పించాడు. ఈ ఘటన బ్రెజిల్‌ దేశంలో వెలుగుచూసింది.

65 ఏళ్ల వయసులో పెళ్లి..
బ్రెజిల్‌లో అమ్మాయిల కనీసం వివాహ వయసు 16 ఏళ్లు. అక్కడి చట్టాల ప్రకారం 16 ఏళ్లు దాటిన యువతులు తల్లిదండ్రుల అనుమతితో తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. తాజాగా దక్షిణ బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రం అరౌకారియా సిటీ మేయర్‌ 65 ఏళ్ల హిస్సామ్‌ హుస్సేన్‌ దేహైనీ గత ఏప్రిల్‌లో వయసులో తన కంటే 49 ఏళ్లు చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సదరు అమ్మాయికి ఏప్రిల్‌ 11న, 16 ఏళ్లు నిండటంతో మరుసటి రోజే ఆమెను పెళ్లాడాడు.

అత్తకు కృతజ్ఞతతో..
సాధారణంగా పెళ్లయిన కొత్తలో అల్లుడు అత్తవారింటిపై కృతజ్ఞతతో ఉంటారు. అత్తవారింట్లో అల్లుడికి కూడా రాచమర్యాదలు లభిస్తాయి. కొసరి కొసరి వడ్చిండం, పంచభక్ష పరమాన్నాలు చేయడం చూస్తుంటా. అయితే పదహారేళ్ల పడుచు పిల్లను తనకు ఇచ్చి పెళ్లి చేసిన అత్తకు కూడా ఏదైనా చేయాలనుకున్నాడు ఆ 65 ఏళ్ల మేయర్‌. అప్పటికే విద్యాశాఖలో తక్కువ జీతంతో పనిచేస్తున్న అత్తను సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమించాడు. అయితే, ఇదే ప్రస్తుతం అతని కొంప ముంచింది. కూతురిని పెళ్లాడటం కోసం తల్లికి లంచంగా పదోన్నతి కట్టబెట్టినట్లు డిప్యూటీ మేయర్‌ సీమా ఆరోపించింది. దీంతో మేయర్‌పై వచ్చిన అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి.

కొత్త భార్య కాలేజీకి..
ఇక మేయర్‌ దేహైనీకి ఇది మూడో వివాహం. ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలకూ విడాకులు ఇచ్చాడు. కొత్త భార్యకు పదహారేళ్లే కావడంతో ఆమెను కాలేజీకి పంపిస్తున్నాడు. మరి కాలేజీకి వెళ్తున్న ఆ ఆపహారేళ్ల పడుచు.. భర్తతో కాపురం చేస్తుందో.. లేక అక్కడే ఎవరినైనా చూసుకుంటుందో చూడాలి. ఎందుకంటే వయసు అలాంటిది మరి. ఈ ముసలోడితో ఎంతకాలం అన్న భావన కలిగితే ఆ ఆరు పదుల వయసు దాటిన మేయర్‌ మరో పెళ్లి చేసుకుంటాడేమో!