https://oktelugu.com/

Game changer : 8 రోజుల్లో 200 కోట్లు గ్రాస్..డిజాస్టర్ టాక్ తో ‘గేమ్ చేంజర్’ కి ఇది మంచి వసూళ్లే..షేర్ వసూళ్లు ఎంత వచ్చిందంటే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం భారీ అంచనాల నడుమ విడుదల డిజాస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకోవడం అభిమానులను తీవ్రమైన మనస్తాపానికి గురయ్యేలా చేసిన సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 18, 2025 / 02:53 PM IST
    Game changer

    Game changer

    Follow us on

    Game changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదల డిజాస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకోవడం అభిమానులను తీవ్రమైన మనస్తాపానికి గురయ్యేలా చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి ఏ రేంజ్ డిజాస్టర్ టాక్ వచ్చిందో, ఈ చిత్రానికి కూడా అదే రేంజ్ డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ ప్రభావం సినిమా వసూళ్లపై భారీగా పడింది. మొదటిరోజే 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని అంచనా వేశారు. కానీ అందులో సగం మాత్రమే వచ్చాయి. మేకర్స్ మాత్రం మొదటి రోజు 186 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. ఇతర హీరోల అభిమానులు రామ్ చరణ్ పై సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్స్ వేశారు. సినిమా పై నెగటివిటీ పీక్ రేంజ్ లో పెరిగిపోయింది.

    పైగా నిర్మాత దిల్ రాజు విడుదల తర్వాత ‘గేమ్ చేంజర్’ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, ఆయన నిర్మించిన రెండవ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం వంటివి చూసిన తర్వాత జనాలు ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ అయ్యింది కాబట్టి, దిల్ రాజు ఆ సినిమా పట్టించుకోలేదు అని చర్చించుకున్నారు. ఒక సినిమా థియేటర్స్ లో రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి టాక్ వ్యాప్తి చెందడం దురదృష్టకరం అనే చెప్పాలి. అయితే ఇన్ని నెగేటివ్స్ మధ్య కూడా ఈ చిత్రం మొదటి వారం లో 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. నేటితో ఈ సినిమా 200 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి అడుగుపెట్టినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. డిజాస్టర్ టాక్ తో ఇంత వసూళ్లు రావడం గ్రేట్. కానీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇది ఏమాత్రం సరిపోదు.

    మరో 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. నేటితో థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసినట్టే అని, ఇక నుండి నెట్ ఫ్రీ మీద మాత్రమే ఈ చిత్రం రన్ అవుతుందని అంటున్నారు. నెట్ ఫ్రీ అంటే కమీషన్ బేసిస్ మీద అన్నమాట. అంటే వచ్చే గ్రాస్ వసూళ్ళలో కొంత శాతం థియేటర్ యాజమాన్యం మరియు బయ్యర్లు పంచుకుంటారు. మామూలుగా అయితే రెంటల్ బేసిస్ మీదనే నడుస్తాయి. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 109 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే మరో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిజాస్టర్ టాక్ తో వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టాము అని అభిమానులు గర్వంగా చెప్పుకోవచ్చు కానీ, కమర్షియల్ గా డిజాస్టర్ గానే మిగిలింది.