Devara: ‘దేవర’ కే ఈరేంజ్ ఉందంటే..ఇక ‘పుష్ప 2’ బీభత్సం ఏ రేంజ్ లో ఉంటుందో?..ఫ్యాన్స్ కి ఊపుని ఇచ్చే వార్త చెప్పిన నిర్మాతలు!

'దేవర' చిత్రానికి కేవలం తెలుగు లో మాత్రమే క్రేజ్ ఉంది. మిగిలిన భాషల్లో అంతగా లేదు అనొచ్చు. కానీ 'పుష్ప 2' వేరు, ఈ సినిమాకి తెలుగు లోనే కాదు, అన్ని ప్రాంతీయ భాషల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. కారణం పుష్ప పార్ట్ 1 ఆ స్థాయిలో హిట్ అయ్యింది కాబట్టి. తెలుగు ఆడియన్స్ ని మాత్రమే టార్గెట్ చేసుకొని తీసిన ఈ సినిమా, పాన్ ఇండియా లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషలకు సంబంధించిన ఆడియన్స్ కి నచ్చేసింది.

Written By: Vicky, Updated On : September 24, 2024 4:57 pm

Devara

Follow us on

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. టికెట్స్ ప్రతీ చోట హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా ప్రస్తుతం దేవర గురించే చర్చించుకున్నారు. ఆ స్థాయిలో ఈ సినిమా టికెట్స్ కి డిమాండ్ ఏర్పడింది. ఇక నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి 2 మిలియన్ డాలర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగింది. మరో మూడు రోజుల్లో 5 లక్షల డాలర్లు అదనంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా ఎన్టీఆర్ కెరీర్ లో అద్భుతమైన ట్రెండింగ్ తో కొనసాగుతున్న ‘దేవర’ చిత్రాన్ని చూసి ఇక ‘పుష్ప 2’ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ట్రేడ్ పండితులు ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు.

‘దేవర’ చిత్రానికి కేవలం తెలుగు లో మాత్రమే క్రేజ్ ఉంది. మిగిలిన భాషల్లో అంతగా లేదు అనొచ్చు. కానీ ‘పుష్ప 2’ వేరు, ఈ సినిమాకి తెలుగు లోనే కాదు, అన్ని ప్రాంతీయ భాషల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. కారణం పుష్ప పార్ట్ 1 ఆ స్థాయిలో హిట్ అయ్యింది కాబట్టి. తెలుగు ఆడియన్స్ ని మాత్రమే టార్గెట్ చేసుకొని తీసిన ఈ సినిమా, పాన్ ఇండియా లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషలకు సంబంధించిన ఆడియన్స్ కి నచ్చేసింది. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కూడా బాగా క్లిక్ అయ్యింది. అన్ని కలిసొస్తే ఈ చిత్రానికి మొదటి రోజే 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఓవర్సీస్ లో సరైన ప్లానింగ్ తో విడుదల చేస్తే కేవలం ప్రీమియర్స్ నుండే 5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టే సత్తా ఉన్న సినిమా. డిసెంబర్ 6 న విడుదల కాబోతున్న ఈ సినిమా కి సంబంధించిన చిన్న అప్డేట్ నిన్న మేకర్స్ నుండి వచ్చింది. చాలా మంది ఈ చిత్రం డిసెంబర్ 6 న విడుదలయ్యే అవకాశాలు తక్కువ, వచ్చే ఏడాది సమ్మర్ కి వాయిదా పడొచ్చు అని ఒక రూమర్ ని ప్రచారం చేసారు. దీనికి కౌంటర్ ఇస్తే మరో 75 రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ఒక సరికొత్త పోస్టర్ ద్వారా తెలియచేసారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి మూడవ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే తెలపనున్నారట మేకర్స్. దీని కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.