Nagababu: భారీ గుబురు గడ్డం.. తెల్లటి లాల్చి పైజామా.. కళ్లకు పాత తరం కళ్లజోళ్లు.. చేతిలో ఒక పుస్తకం.. చూస్తుంటే ఏదో స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న పాతతరం అభ్యుదయ నేతగా కనిపిస్తున్నారు. ఎవరయ్యా అని దగ్గరికెళ్లి పరిశీలస్తే అది మన మెగా బ్రదర్ ‘నాగబాబు’. జనసేన పార్టీలో తాజాగా యాక్టివ్ అయిన నాగబాబు తన లుక్ ను పూర్తిగా మార్చేశారు. పూర్తిగా నయా లుక్ లో కనిపిస్తున్నారు. గాంధీజీ, నేతాజీల స్ఫూర్తితో పూర్తిగా నాగబాబు మారిపోయారు. ఆయన లుక్ ఇలా మారిపోవడానికి కారణం ఏంటి? ఎందుకిలా తయారయ్యారన్న దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ప్రస్తుతం నాగబాబు టీవీ షోలతో బిజీగా ఉన్నారు. కామెడీ స్టార్స్ జడ్జిగా ఆ నవ్వులను ఆస్వాదిస్తున్నారు. అందులో స్టైలిష్ మేకప్, నెత్తిమీద ఒత్తైన జుట్టుతో స్మార్ట్ గా కనిపిస్తారు. ఆ షో కోసం అలా మేకోవర్ అవుతుంటారు. అయితే ఈ మధ్య జనసేన పార్టీలో తమ్ముడు పవన్ కళ్యాణ్ తర్వాత అన్నింట్లోనూ తానై వ్యవహరిస్తూ యాక్టింగ్ గా పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినిమా గెటప్ లను పక్కనపెట్టి తన సహజసిద్ధ రాజకీయ నాయకుడిలా కనిపించేందుకు సరికొత్త అవతారం ఎత్తారు.
రోమ్ లో ఉంటే రోమన్ లా ప్రవర్తించాలన్నది నానుడి. ఇప్పుడు దాన్ని అక్షరాల పాటిస్తున్నారు పవన్ కళ్యాణ్ , నాగబాబు. సినిమాల్లో వేషాలు, స్టైలిష్ జుట్టులు, నయా డ్రెస్సులు వేసుకునే వీరిద్దరూ రాజకీయాల్లో మాత్రం నెరిసిన భారీ గడ్డం.. చూడగానే ఏ గాంధీనో, నేతాజీనో అన్నట్టుగా ఉండే రూపంలో దర్శనమిస్తున్నారు. ప్రజలకు చేరువ కావాలన్నా.. వారితో కలిసి పోవాలన్నా ఇలాంటి లుక్ లే అవసరం.

అందుకే ప్రజా నాడి తెలుసు కాబట్టే నాగబాబు కూడా సాధారణ వ్యక్తిలా మారిపోయారు. ఆయన టీవీ షోలకు ఉండే గెటప్ కు.. బయట జనసేన కార్యక్రమాల్లో గెటప్ లకు పొంతన లేకుండా ప్రజాస్వామ్యంలో సేవా చేసే ఒక నేతగా కనిపిస్తున్నారు. ఆ లుక్ లో అందరికీ ఆదర్శంగా కనిపిస్తున్నారు. ఇక ఈ జీవితం ప్రజాసేవకే అంకితం అంటూ సోషల్ మీడియాలోనూ పేర్కొని తన కొత్త లుక్ ను పరిచయం చేశారు.
జనసేనలో చేరిన నాగబాబు పోయిన సార్వత్రిక ఎన్నికల్లో నరసారావుపేట పార్లమెంట్ నుంచి జనసేన తరుఫున ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత చాలా రోజులు సైలెంట్ గా ఉండి టీవీ షోలు చేసిన నాగబాబు తాజాగా జనసేనలో యాక్టివ్ అయ్యారు. తరచూ మీటింగ్ లు, సమీక్షలకు హాజరవుతూ అచ్చం రాజకీయ నేత లుక్ లోకి మారిపోయారు.
Also Read: TRS Politics : బీజేపీతో ఫైట్.. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్ కు పనిచేస్తుందా?
Recommended Videos


